Category : జాతీయ | Sub Category : తాజా వార్తలు Posted on 2024-09-27 12:07:50
తెలుగు వెబ్ మీడియా న్యూస్: జమ్మూకశ్మీర్ లోని ఉగ్రవాదులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అల్టిమేటం జారీ చేశారు. వారు ఉగ్రవాదాన్ని వదలకపోతే భారత జవాన్ల చేతిలో చావు తప్పదని ఎన్నికల సభలో హెచ్చరించారు. జమ్మూకశ్మీర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అక్కడ అలజడి సృష్టించేందుకు యత్నించే వారిని వదిలిపెట్టేది లేదు. ఉగ్రవాదాన్ని పాతాళానికి తొక్కే వరకూ విశ్రమించం. గత 4 దశాబ్దాలుగా కాంగ్రెస్, ఎన్సీ ఉగ్రవాదాన్ని పోషించాయి అని విమర్శించారు.