Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2024-09-27 11:37:35
తెలుగు వెబ్ మీడియా న్యూస్: పవన్ కళ్యాణ్ ని హిందువులు మాత్రమే కాదు, క్రైస్తవులు, ముస్లింలు కూడా ప్రేమిస్తారని మెగా బ్రదర్ నాగబాబు అన్నారు. నీ మతంతో పాటు సాటి మతాలని గౌరవించు, రక్షించు అని సమానత్వాన్ని చాటిందే సనాతన ధర్మం. ఆ ధర్మాన్నే పవన్ కళ్యాణ్ పాటిస్తారు. నమాజ్ వినిపిస్తే తన స్పీచ్ ఆపేస్తారు. పవన్ కళ్యాణ్ మాటలు సూడో సెక్యులర్ వాదులకి తప్ప క్రిస్టియన్, ముస్లింలకు బాధ కలిగించవు. అర్ధం చేసుకోగలరు అని ట్వీట్ చేశారు.