Responsive Header with Date and Time

Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2024-09-27 11:21:17


త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో తన మంత్రివర్గాన్ని విస్తరణ చేపట్టబోతున్నారు. మంత్రివర్గ విస్తరణ లో ఈసారి మైనార్టీ నేతకు మంత్రి పదవి దక్కుతుందా లేదా అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. మరోవైపు ఇప్పటికే మంత్రివర్గ విస్తరణకు కసరత్తును కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. దసరాలోపు మంత్రి వర్గాన్ని చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారట. అయితే ఇప్పుడు మంత్రి పదవి దక్కనున్న మైనార్టీ నేత ఎవరు అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. పీసీసీ అధ్యక్షుడి నియామకం పూర్తి అయ్యాక పెండింగ్ లో ఉన్న మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇందుకు అధిష్టానం కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. దసరా లోపు పూర్తిస్థాయి విస్తరణ ఉండబోతుందన్నట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు వస్తున్న నేపథ్యంలో ఆశావాహులు మరొకసారి తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఈసారి మైనారిటీ వర్గానికి కచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో మైనార్టీ ఓటు బ్యాంక్ బీఆర్ఎస్ కే ఎక్కువ పడింది. ఈ నేపథ్యంలో ఈసారి మంత్రివర్గంలో మైనార్టీకి చోటు కల్పించి జీహెచ్ఎంసీ ఎన్నికలతోపాటు స్థానిక సంస్థలలో పట్టు సాధించాలని కాంగ్రెస్ భావిస్తుంది.

అయితే మైనార్టీ వర్గానికి మంత్రి పదవి కేటాయిస్తే ఎవరికి ఇవ్వాలనే దానిపై సీఎం రేవంత్ రెడ్డి తోపాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తర్జనభర్జన పడుతున్నారట. ఇప్పటికే సీనియర్ నేత షబ్బీర్ అలి అదేవిధంగా ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన అమీర్ అలీ ఖాన్, వక్స్ బోర్డ్ చైర్మన్ అజ్మాతుల్లా హుస్సేన్, ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్ ల పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అడ్వైజర్ గా ఉన్న షబ్బీర్ అలీకి మంత్రి పదవి ఇస్తే, స్థానిక సంస్థల ఎన్నికల్లో మైనార్టీ ఓట్ బ్యాంక్ పెంచుకోవచ్చని హైకమాండ్ ఆలోచిస్తుందట. మరోవైపు ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన అమీర్ ఖాన్ పేరు కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారని కూడా గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతుంది.ఇక ఫిరోజ్ ఖాన్ విషయానికొస్తే హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీలో దమ్మున్న మైనార్టీ నేతగా పేరు ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ, పార్లమెంటు ఎన్నికల్లో టికెట్ కోసం ఆశించి భంగపడ్డారు. ఇదే హైకమాండ్ నేతల దృష్టిలో పడేలా చేసింది. అయన పేరు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వక్స్ బోర్డ్ చైర్మన్ అజ్మాతుల్లా హుస్సేన్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటే, ఏ విధంగా ఉంటుందని ఆలోచనలో కాంగ్రెస్ తోపాటు సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. మొత్తానికి మరి మైనార్టీ నేతల్లో ఎవరికి ఈసారి మంత్రివర్గంలో బెర్తు దక్కుతుందో అనేది దసరా వరకు వేసి చూడాల్సిందే..!


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
Leave a Comment: