Category : క్రీడలు | Sub Category : అంతర్జాతీయ Posted on 2025-04-26 10:35:16
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- దక్షిణకొరియా వేదికగా జరుగనున్న ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ కోసం భారత అథ్లెటిక్స్ సమాఖ్య(ఏఎఫ్‌ఐ) 59 మందితో జట్టును శుక్రవారం ఎంపిక చేసింది. కొచ్చిలో తాజాగా ముగిసిన ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ టోర్నీలో మెరుగైన ప్రదర్శన కనబరిచిన వారిని ఏషియన్ చాంపియన్‌షిప్‌నకు పరిగణనలోకి తీసుకున్నారు.
తెలంగాణ నుంచి నిత్య గాదెతో పాటు అగసర నందిని భారత అథ్లెటిక్స్ జట్టులో చోటు దక్కించుకున్నారు. మహిళల 200మీటర్ల రేసుతో పాటు 4X 100 రిలే రేసులో నిత్య బరిలో దిగనుండగా, హెప్టాథ్లాన్‌లో నందిని పోటీపడనుంది. ఇదిలా ఉంటే స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఏషియన్ అథ్లెటిక్స్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. చివరిసారి 2017లో ఆడిన నీరజ్ ప్రతిష్ఠాత్మక టోర్నీలై డైమండ్ లీగ్‌తో పాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లపై దృష్టి సారించాడు. దీనికి తోడు వచ్చే నెల బెంగళూరులో జరుగనున్న నీరజ్ చోప్రా క్లాసిక్ టోర్నీ కోసం నీరజ్ సిద్ధమవుతున్నాడు.
షాట్‌పుటర్ తజిందర్‌పాల్‌సింగ్‌తో పాటు పోల్‌వాల్టర్ దేవ్‌కుమార్‌మీనా భారత జట్టులో చోటు దక్కించుకోపోగా, అవినాశ్ సాబ్లె, పారుల్ చౌదరీ, గుల్వీర్‌సింగ్, జ్యోతి యర్రాజీ, ప్రవీణ్ చిత్రవేల్ సత్తాచాటేందుకు తహతహలాడుతున్నారు.