Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-26 10:17:23
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం సింగ్‌నగర్‌లోని అన్న క్యాంటీన్‌ను పరిశీలించారు. నగర మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి అన్న క్యాంటీన్‌కు వచ్చిన కలెక్టర్ లైనులో నిలబడి రూ.5 చెల్లించి టోకెన్ కొని, అల్పాహారాన్ని రుచి చూశారు. ఆహార పట్టిక, టోకెన్ కౌంటర్, ఆహార పదార్థాలను వడ్డిస్తున్న శైలి, డైనింగ్ ఏరియాతోపాటు మంచినీరు, చేతులు శుభ్రం చేసుకునే ప్రదేశాలను పరిశీలించారు. నాణ్యత, క్యాంటీన్‌లో పరిశుభ్రతపై అక్కడ ఆహారం తీసుకుంటున్న వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకలితో ఉన్న వారికి పట్టెడన్నం పెట్టడం ద్వారా ఎంతో సంతృప్తి కలుగుతుందన్నారు.