Category : నేర | Sub Category : జాతీయ Posted on 2025-04-17 11:06:10
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- భక్తుల రద్దీతో పాటు నిత్యం అమ్మవారి నామస్మరణతో మార్మోగే ఇంద్రకీలాద్రిపై పట్టపగలు జరిగిన ఘరానా చోరీతో భక్తులు ఉలిక్కిపడ్డారు. వాహనాల రాకపోకలు, భక్తుల తాకిడి ఉండే దుర్గ గుడిపై చోరీ ఎలా జరిగింది. కొండపై నిఘా కొరవడిందా..? లేకపోతే భక్తుల నిర్లక్ష్యమా అన్న చర్చ మొదలైంది. కారులో పెట్టిన బంగారం దర్శనం చేసుకొచ్చేలోపు మాయం కావటంతో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరైంది.
పెళ్లికి వెళ్తూ దుర్గమ్మని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికొచ్చిన కుటుంబం ఊహించని ఘటనతో తీవ్ర ఆవేదనలో మునిగిపోయింది. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన ఆ కుటుంబం న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. అమ్మవారి దర్శనం కాస్త ఆలస్యమైంది. బయటికొచ్చి కారు తీసి చూస్తే లోపల బంగారు నగల బ్యాగ్ మాయమైంది. దీంతో ఒక్కసారిగా షాక్ తింది బాధిత కుటుంబం. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.
హైదరాబాద్ రాజేంద్రనగర్‌కి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి దుర్గారావు కుటుంబ సభ్యులతో అమలాపురంలో బంధువుల పెళ్లికి వెళ్తూ మధ్యలో దుర్గమ్మ దర్శనానికి ఆగినప్పుడు జరిగిందీ ఘటన. కొండపై ఘాట్ రోడ్డు ఓం టర్నింగ్ సమీపంలో కారును పార్క్ చేసి దర్శనానికి వెళ్లారు. అమ్మవారికి నివేదన సమర్పించే సమయం కావడంతో క్యూలైన్లో రెండు గంటలపాటు ఉన్న దుర్గారావు కుటుంబ సభ్యులు దర్శనం తర్వాత తిరిగొచ్చి చూస్తే కారులో 270 గ్రాముల బంగారమున్న బ్యాగ్ కనిపించలేదు