Category : క్రీడలు | Sub Category : జాతీయ Posted on 2025-04-26 10:22:20
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- సన్ రైజర్స్ ఖాతాలో మరో విజయం. దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది. తొలిసారి చెపాక్లో సీఎస్కేను ఓడించడం ఇక్కడ గమనించాల్సిన విషయం.
ఐపీఎల్ 2025 సీజన్లో చెపాక్ వేదికగా తొలిసారి సన్రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్న ఐదు వికెట్ల తేడాతో మట్టికరిపించింది. దీంతో ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. తొమ్మిది మ్యాచుల్లో మూడు విజయాలనే నమోదు చేసిన సన్ రైజర్స్.. మిగతా ఐదు మ్యాచుల్లో అన్నీ గెలిస్తేనే నాకౌట్ కు చేరుతుంది. ఈ విషయంలో తమకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టే స్ఫూర్తి అని ఎస్ఆర్ హెచ్ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించాడు.
చైన్నైపై విజయం సాధించడం ఆనందంగా ఉంది. ఇకనుంచి మేం ఒక్కో మ్యాచ్ ఫలితం గురించి ఆలోచిస్తాం. ఇప్పుడు గెలిచాం. మిగిలిన వాటిల్లోనూ విజయం సాధించేందుకు ప్రయత్నిస్తాం. కమిందుతో కలిసి కీలక భాగస్వామ్యం నిర్మించడం బాగుంది. భారీ షాట్లకు పోకుండా తేలికగా మ్యాచు ముగించాలని మాట్లాడుకున్నాం. నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ బౌలింగ్ బాగా చేస్తున్నారు. చివరికి మేం విజయం సాధించాం. మాకు డూ ఆర్ డై లాంటి పోరు. గతేడాది ఇదే పరిస్థితుల్లో ఆర్సీబీ ఉంది. వరుసగా మ్యాచులు గెలిచి ప్లే ఆఫ్స్క చేరుకుంది. ఈ సంవత్సరం మేం ఎందుకు సాధించకూడదు? వందశాతం ప్రదర్శన ఇస్తే మిగతా మ్యాచుల్లో విజయం సాధించే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి అని నితీశ్ వెల్లడించాడు.