Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-10 10:18:31
తెలుగు వెబ్ మీడియా న్యూస్ :- బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఉత్తర- ఈశాన్య దిశగా తిరిగి వచ్చి, 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందంటున్నారు అధికారులు. దీని ప్రభావంతో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందంటున్నారు అధికారులు.
నిన్న నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఒకసారి చూస్తే.. కర్నూలు జిల్లా ఉలిందకొండలో అత్యధికంగా 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లా దరిమడుగలో 40.3 డిగ్రీలు, చిత్తూరు జిల్లా తవణంపల్లెలో 40.1 డిగ్రీలు, కడప జిల్లా అమ్మలమడుగులో 39.9 డిగ్రీలు, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎర్రంపేటలో 38.7 డిగ్రీలు, అమరావతిలో 38.7 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతల నమోదయ్యాయి.