Responsive Header with Date and Time

అగ్గిపూల సోయగం.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

Category : జీవనశైలి | Sub Category : జీవనశైలి Posted on 2025-04-10 10:09:29


అగ్గిపూల సోయగం.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

తెలుగు వెబ్ మీడియా న్యూస్:మోదుగ పూలు వసంతకాలపు అందాన్ని సూచించడమే కాకుండా, అనేక ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఈ చెట్టు పువ్వులు, ఆకులు, విత్తనాలు, బెరడుఔషధంగా ఉపయోగిస్తారు. మోదుగ పూల పుప్పొడి హోలీ రంగులకు, ఆకులు పూజలలో ఉపయోగపడతాయి. మోదుగ చెట్టు బెరడును ఎండబెట్టి హోమాల్లో వినియోగించడం ద్వారా చెడు వాసనలు తొలగిపోతాయని నమ్మకం. మోదుగ కలప ప్యాకేజింగ్ బాక్స్‌ల తయారీలోనూ ఉపయోగపడుతుంది. ఈ చెట్టు శరీరానికి  లా పనిచేస్తూ జీర్ణ సమస్యలు, మలబద్ధకం, మూత్ర సంబంధిత ఇబ్బందులు, చర్మ వ్యాధులు వంటి అనేక సమస్యలకు ఉపశమనం ఇస్తుంది.

మోదుగ విత్తనాల పొడిని తేనెతో కలిపి తీసుకోవడం, మోదుగ మొగ్గలతో చేసిన నూనె వాడటం, ఆకుల రసాన్ని తాగడం వంటివి ఆయుర్వేదంలో చెప్పబడిన విధానాలే. ఇది నిద్రలేమి, కంటి చూపు, జీర్ణ సంబంధిత సమస్యలు, దురద, క్రిములు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. మోదుగలో ఉండే విటమిన్ సి, కెరోటినాయిడ్లు, ఫ్లేవనాయిడ్లు వంటి పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతూ, రక్తాన్ని శుద్ధి చేసి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అందుకే మోదుగ పూలను అందమైన ప్రకృతి భూతంగా కాకుండా ఆరోగ్య పరిరక్షకంగా చూడాలి.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
తాజా వార్తలు
Leave a Comment: