Category : క్రీడలు | Sub Category : అంతర్జాతీయ Posted on 2025-04-10 09:54:57
తెలుగు వెబ్ మీడియా న్యూస్: ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్ ఖాతాలో మరో రజతం చేరింది. బుధవారం జరిగిన పది మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత జోడీ ఆర్య-రుద్రాంక్ష్ 9 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచారు. చైనా ద్వయం వాంగ్ జిఫీ-సంగ్ బుహాన్ 17 పాయింట్లతో స్వర్ణం దక్కించుకుంది. మంగళవారం రాత్రి ముగిసిన పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్‌లో భారత యువ షూటర్ విజయ్‌వీర్ సిద్ధు స్వర్ణం గెలుచుకున్నాడు. భారత్ ఏడు పతకాలతో రెండో స్థానంలో ఉంది.