Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-04-09 10:46:36
తెలుగు వెబ్ మీడియా న్యూస్:తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలను స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఖండిరచారు. దేవునూరు గుట్టలను ఆక్రమిస్తున్నారంటూ బీఆర్‌ఎస్ నేతలు చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడారు. నా 30 ఏళ్ల రాజకీయ జీవితం లో ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు. 2వేల ఎకరాలు కబ్జా చేశానంటూ ఎలాంటి ఆధారాలు లేకుండా దుష్ప్రచారం ఏస్తున్నారు. బినామీలకు భూములు అప్పగించేందుకు యత్నిస్తున్నానంటూ నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. నేను కబ్జా చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజయ్య ఇంట్లో గులాంగా పనిచేస్తా. ఆరోపణలు నిరూపించలేకపోతే వారు నాకు గులాంగా ఉంటారా? తప్పుడు ఆరోపణలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటా అని అన్నారు.