Responsive Header with Date and Time

ఈ పండు ప్రత్యేకతలేంటో తెలుసా..?

Category : ఆరోగ్యం | Sub Category : ఆరోగ్యం Posted on 2025-04-09 10:27:45


ఈ పండు ప్రత్యేకతలేంటో తెలుసా..?

తెలుగు వెబ్ మీడియా న్యూస్:  మార్కెట్‌లో మ‌న‌కు ఎన్నో ర‌కాల పండ్లు అందుబాటులో ఉంటాయి. అయితే, వాటిలో మ‌నం కొన్ని రకాల పండ్ల‌ను మాత్ర‌మే తింటుంటాం. కొన్ని పండ్ల‌ను అస‌లు రుచి కూడా చూడం. అలాంటి పండ్ల‌లో పియ‌ర్ పండు కూడా ఒక‌టి. ఇవి గ్రీన్ లేదా ప‌సుపు రంగులో ఉంటాయి. వీటి ధ‌ర కూడా కాస్త ఎక్కువే ఉంటుంది. కానీ, పియర్‌ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల కలిగే లాభాలు మాత్రం అద్భుత‌మైన ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు చాలా ఉంటాయి. పియర్‌ పండ్లు తినడం వల్ల ఎలాంటి లభాలని పొందవచ్చో తెలుసుకుందాం.

పియర్స్ పండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీటితో కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. దీంతో గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. పియర్స్ పండ్లు తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఇందులో తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. పియర్స్ పండ్లలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అనేక రకాల ఇన్ఫెక్షన్స్‌కి దూరంగా ఉండొచ్చు. పియర్స్ పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

ఇందులో ఉండే ప్రీబయోటిక్స్ జీర్ణ ఆరోగ్యానికి సహకరిస్తాయి. పేగులను ఆరోగ్యంగా ఉంచి మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కల్పిస్తాయి.. పియర్స్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. వీటిని తింటే చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. అందంగా, యవ్వనంగా కనపడొచ్చు. పియర్స్ ఎముకలు ఆరోగ్యంగా, దృఢంగా ఉండడానికి సహాయం చేస్తాయి. ఆస్టియోపొరోసిస్ వంటి ప్రమాదకరమైన సమస్యలు రాకుండా చూస్తాయి. ముఖ్యంగా ఈ పండ్ల‌లో ఉండే పాలిఫినాల్స్ క‌ణాలు నాశ‌నం అవ‌కుండా చూస్తాయి. ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో క్యాన్స‌ర్, గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. పియర్స్ పండ్లు తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఇందులో ఉండే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ షుగర్ ఉన్న వారికి సహాయం చేస్తుంది. పియ‌ర్స్ పండ్ల‌లో రెండు ర‌కాల ఫైబ‌ర్‌లు ఉంటాయి. సాల్యుబుల్‌, ఇన్‌సాల్యుబుల్ ఫైబ‌ర్‌లు ఉండటం వల్ల ఈ పండ్ల‌ను తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్ర‌ణ‌లోకి వ‌స్తాయి.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
తాజా వార్తలు
Leave a Comment: