Responsive Header with Date and Time

Category : | Sub Category : రాజకీయం Posted on 2024-01-02 06:56:05


జగన్ పై వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తిగా ఉన్నారని విమర్శ

 4 ఏళ్ల 9 నెలల సమయంలో ముఖ్యమంత్రి జగన్ అన్ని రంగాల్లో విఫలమయ్యారని టిడిపి ఎంపీ కేశినేని నాని విమర్శించారు. ముఖ్యమంత్రిగా ఆయన సాధించిందేమీ లేదని అన్నారు. జగన్ పాలనపై వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేలు, నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ప్రభుత్వంపై ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో వారు వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వాన్ని గద్దె దింపడం ఖాయమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ పార్లమెంటు స్థానంలో 16 లక్షల మంది ఓటర్లు తనతో ఉన్నారని చెప్పారు. తాను కూడా ప్రజలతోనే ఉంటానని చెప్పారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
Leave a Comment: