Category : | Sub Category : రాజకీయం Posted on 2024-01-02 06:42:43
అమరావతిః వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం దశల వారీగా సామాజిక పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడా పెన్షన్ ను రూ.3 వేలకు పెంచారు. పెంచిన పెన్షన్ నేటి నుంచి అమల్లోకి రానుంది. కాగా, ఈ నెల నుంచి కొత్తగా 1,17,161 మందికి పెన్షన్ అందించనున్నారు.
2019లో పెన్షన్ రూ.2,250 కాగా… 2022 నాటికి అది 2,500 అయింది. 2023లో రూ.2,750 అందించారు. ఇప్పుడు మరో రూ.250 పెంచి రూ.3 వేలు చేశారు. పెంచిన పెన్షన్ ను మండలాలవారీగా ఈ నెల 8 వరకు అందించనున్నారు. ఈ జనవరిలో మొత్తం 66.34 లక్షల మందికి రూ.1,968 కోట్లు పంపిణీ చేయనున్నారు. కాగా, పెన్షన్ భారం ఏడాదికి రూ.23,556 కోట్లు అని తెలుస్తోంది. కాగా, రూ.3 వేల పెన్షన్ అందిస్తామని గత ఎన్నికల సమయంలో వైఎస్‌ఆర్‌సిపి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.