Category : | Sub Category : రాజకీయం Posted on 2024-01-01 20:32:05
ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో లైన్ ఉంటుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మెట్రో, ఫార్మాసిటీ కానీ రద్దు చేయడం లేదని.. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని చెప్పారు. ఎయిర్‌పోర్టుకి గత ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్లతో పోలిస్తే ఇప్పుడు దూరం తగ్గుంతుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
హైదరాబాద్: ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో లైన్ ఉంటుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మెట్రో, ఫార్మాసిటీ కానీ రద్దు చేయడం లేదని.. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని చెప్పారు. ఎయిర్‌పోర్టుకి గత ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్లతో పోలిస్తే ఇప్పుడు దూరం తగ్గుంతుందని అన్నారు. BHEL నుంచి ఎయిర్‌పోర్టు వరకు 32 కిలోమీటర్లు వస్తుందన్నారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్, ఓఎస్ హాస్పిటల్ మీదుగా చాంద్రాయణగుట్ట వద్ద ఎయిర్‌పోర్టుకి వెళ్లే మెట్రోలైన్‌కి లింక్ చేస్తామన్నారు. మియాపూర్ నుంచి అవసరమైతే రామచంద్ర పురం వరకు... అవసరమైతే మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోని ఫైనాన్సిల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తాం. గచ్చిబౌలి ఏరియా నుంచి ఎయిర్‌పోర్టుకి మెట్రోకి వెళ్లేవారు దాదాపు ఉండరని చెప్పారు. తాము కొత్తగా ప్రతిపాదిస్తున్న మెట్రో లైన్స్ గత ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం కంటే తక్కువ అవుతుందని తెలిపారు. ఫార్మాసిటీని అంచలంచలుగా రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. జీరో కాలుష్యంతో ఈ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. అక్కడి పరిశ్రమల్లో పనిచేసే వాళ్లకి అదే ప్రాంతాల్లో గృహనిర్మాణం కూడా ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.