Responsive Header with Date and Time

ఇంటిముందు ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి.. అమాంతం మింగేసిన ఇనుప గేటు..ఏం జరిగిందంటే..

Category : | Sub Category : క్రైమ్ Posted on 2024-08-02 17:20:02


ఇంటిముందు ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి.. అమాంతం మింగేసిన ఇనుప గేటు..ఏం జరిగిందంటే..

TWM News:-పిల్లలు ఆడుకుంటున్న సమయంలో ఇనుప గేటు ఆ చిన్నారిపై కూలుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయింది. అప్పుడు ఒక బాలుడు ఇనుప గేటుకు అవతలి వైపు ఉన్నాడు. అంతలోనే గేటు బలంగా కిందపడిపోయింది. అప్పుడు బయట ఆడుకుంటున్న అమ్మాయి గేటు కిందకు వచ్చింది. దీంతో గేటు కిందపడి చిన్నారి శరీరం నలిగిపోయింది. ఈ దారుణ ఘటనతో ప్రాంతమంతా తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ముక్కుపచ్చలారని మూడేళ్ల చిన్నారి ఇనుప గేటు కింద పడి చిధ్రమైపోయింది. పుణెలోని పింప్రి చించ్‌వాడ్‌లో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మూడున్నరేళ్ల బాలిక ఇంటి బయట ఆడుకుంటుండగా, మరో చిన్నారి ఆ బిల్డింగ్‌ బయట నుండి ఇనుప గేటును పట్టి లాగాడంతో అకస్మాత్తుగా గేటు ఊడి బాలికపై కూలింది. దాంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.

ఈ విషాద సంఘటన పింప్రీ చించ్వాడ్‌లోని బోప్‌ఖేల్ ప్రాంతంలోని గణేష్ నగర్‌లో జరిగినట్లు సమాచారం. ఇక్కడ ఓ బిల్డిండ్‌ కోసం ఏర్పాటు చేసిన ఇనుప గేటు అప్పటికే పాడైపోయింది. ఈ విషయం యజమానికి కూడా తెలుసు. కానీ ఇంతవరకు మరమ్మతులు చేయలేదు. అలాంటి పరిస్థితిలో బుధవారం కొందరు చిన్నారులు ఇంటి బయట ఆడుకుంటుండగా, ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు కాగా, వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

పిల్లలు ఆడుకుంటున్న సమయంలో ఇనుప గేటు ఆ చిన్నారిపై కూలుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయింది. అప్పుడు ఒక బాలుడు ఇనుప గేటుకు అవతలి వైపు ఉన్నాడు. అంతలోనే గేటు బలంగా కిందపడిపోయింది. అప్పుడు బయట ఆడుకుంటున్న అమ్మాయి గేటు కిందకు వచ్చింది. దీంతో గేటు కిందపడి చిన్నారి శరీరం నలిగిపోయింది. ఈ దారుణ ఘటనతో ప్రాంతమంతా తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

కాగా, చనిపోయిన చిన్నారి పేరు గిరిజ. తండ్రి గణేష్ షిండే. గేటు పడిపోయిన భవనం పక్కనే ఆ అమ్మాయి తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు. ఇనుప గేటు పూర్తిగా పాడైపోయిన విషయం భవన యజమానికి కూడా తెలుసునని, కానీ మరమ్మతులు చేయకపోవటం వల్లే ప్రమాదం జరిగిందంటూ ఆ చిన్నారి తల్లిదండ్రులు విలపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ కొనసాగుతోందని చెప్పారు.


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
తాజా వార్తలు
Leave a Comment: