‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు వేడుకల.. సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇవే..
Category : |
Sub Category : క్రీడలు Posted on 2024-02-14 10:41:57
TWM News :- మట్టిలోని మాణిక్యాలను సానపట్టగలిగితే అంతర్జాతీయ తీసుకెళ్లొచ్చన్నారు సీఎం జగన్. విశాఖలో జరిగిన ఆడుదాం ఆంధ్రా ఫైనల్ వేడుకకు సీఎం హాజరయ్యారు. విజేతలకు బహుమతులు అందజేశారు. మట్టిలోని మాణిక్యాలను సానపట్టగలిగితే అంతర్జాతీయ తీసుకెళ్లొచ్చన్నారు సీఎం.
వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా వేడుకలు విశాఖ వైఎస్‌ఆర్ స్టేడియంలో అట్టహాసంగా ముగిసాయి. ముగింపు వేడుకల సంబరాలు అంబరాన్ని తాకాయి. లేజర్ షో ఆకట్టుకుంది. ముగింపు వేడుకల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను సీఎం జగన్ తిలకించారు. వివిధ విభాగాల్లో కళాకారులు నృత్య ప్రదర్శన చేశారు. ఇక ఈ వేడుకలో సీఎం జగన్ తో పాటు పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సభలో ఆడుదాం ఆంధ్రాకు సంబంధించిన ప్రత్యేక గీతాన్ని స్టేడియంలో ప్లే చేశారు.
ముగింపు వేడుకలకు సీఎం జగన్ హాజరయ్యారు. విశాఖ- ఏలూరు జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ను సీఎం జగన్ వీక్షించారు. వేదికపై నుంచి సీఎం జగన్ క్రికెట్ మ్యాచ్ ను తిలకిస్తూ చప్పట్లు కొట్టి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. వివిధ విభాగాల్లో గెలుపొందిన టీమ్స్‌కు స్వయంగా సీఎం చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఆడుదాం ఆంధ్రా టోర్నీలో బాగా ఆడిన ప్లేయర్స్ ను జాతీయ స్థాయిలో పొత్సహిస్తున్నట్లు చెప్పారు సీఎం జగన్. మట్టిలోని మాణిక్యాలను సానపట్టగలిగితే అంతర్జాతీయ తీసుకెళ్లొచ్చన్నారు సీఎం. ఇకపై ప్రతీ ఏటా “ఆడుదాం ఆంధ్రా” టోర్నీని నిర్వహిస్తామని సీఎం జగన్ ప్రకటించారు.
గ్రామీణ యువతలోని క్రీడా నైపుణ్యం వెలికి తీసేందుకు ఏపీ ప్రభుత్వం ‘ఆడుదాం’ ఆంధ్రా అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పటికే వివిధ దశలో విజయం సాధించిన వారికి ఈనెల9న నుంచి 13 వరకు ఫైనల్ మ్యాచ్ లు నిర్వహించారు. అందుకు ముందు క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్మాడ్మింటన్ ఇటువంటి 5 రకాల క్రీడల్లో గత 47 రోజులుగా గ్రామ స్థాయి నుంచి ఈ పోటీలు సాగాయి. వివిధ క్రీడల్లో మొత్తం 25.40 లక్షల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. దాదాపు 37 కోట్ల రూపాయల కిట్లు గ్రామ స్థాయి నుంచి పోటీ పడుతున్న పిల్లలందరికీ ఇచ్చినట్లు సీఎం చెప్పారు. 12.21 కోట్ల రూపాయల బహుమతులు పోటీలో పాలుపంచుకున్న క్రీడాకారులకు ఇచ్చారు.