Responsive Header with Date and Time

సమ్మక్క-సారక్క జాతరకు పోటెత్తిన భక్తులు.. బంగారాన్ని తలపిస్తున్న బెల్లం ధరలు..

Category : | Sub Category : తాజా వార్తలు Posted on 2024-02-13 13:09:18


సమ్మక్క-సారక్క జాతరకు పోటెత్తిన భక్తులు.. బంగారాన్ని తలపిస్తున్న బెల్లం ధరలు..

TWM News: - సమ్మక్క సారక్క అనగానే బెల్లం(బంగారం) గుర్తుకు వస్తుంది. ప్రతి‌ రెండేళ్ళకి‌ ఒకసారి జరిగే ఈ వేడుకను అత్యంత భక్తి‌శ్రద్దలతో నిర్వహించుకుంటారు. బెల్లాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. కోరిన కోరికలు తీరిన తరువాత నిలువెత్తు బంగారం సమర్పించడం అనవాయితీగా వస్తోంది. జాతర కంటే ముందే ఇరవై రోజుల‌నుండి అమ్మవారికి బెల్లాన్ని‌‌ సమర్పిస్తుంటారు. ఎప్పుడూ ‌అందుబాటులో ఉండే బెల్లం ధర ఇప్పుడు పెరుగుతు‌ వస్తుంది. మొన్నటి వరకు కిలో‌ రూ.30 ఉండగా ఇప్పుడు ‌రూ. 60కి చేరుకుంది. బెల్లం ధరలు‌ మరింత పెరిగుతుందని‌ వ్యాపారస్తులు చెబుతున్నారు.

ఉమ్మడి ‌కరీంనగర్ జిల్లాలో మేడారంతో పాటు అనుబంధ జాతరలకి వెళ్తుంటారు. ముందుగా ఇంటి వద్ద అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఆ తరువాత ఇంటి వద్దనే లేదంటే జాతరల వద్ద నిలువెత్తు‌ బంగారాన్ని‌ సమర్పిస్తారు. ఈ విధంగా సమర్పించిన బంగారాన్ని భక్తులకి పంపిణి చేస్తారు. చాలా మంది భక్తులు నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తారు. అయితే ఇదే సమయంలో బెల్లపు ధరలు పెరుగుతున్నాయి. ఉమ్మడి ‌కరీంనగర్ జిల్లాలో 80 ప్రాంతాలలో అనుబంధ జాతరలు జరుగుతుంటాయి. ఈ జాతరలో ఉండే బెల్లం షాపులతో పాటు ఇతర ప్రాంతాల వద్ద భక్తులు బారులు తీరుతున్నారు. ఒకేసారి కిలోకు రూ. 30 వరకు ధర పెరిగింది. భక్తులు ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చెయడంతో‌ కొంత మంది వ్యాపారస్తులు‌ నాణ్యత లోపించిన బంగారం కుడా భక్తులకి అందిస్తున్నారు. హోల్ సెల్‎గా కాస్తా తక్కువగా ఉన్నప్పటికీ రిటేల్‎లో‌ మాత్రం అధిక ధరకి అమ్ముతున్నారు.

పల్లె, పట్నం అనే తేడా లేకుండా సమ్మక్క సారక్కని భక్తి భావంతో పూజిస్తారు.‌ అమ్మవారి పూజ కోసం బెల్లాన్ని ప్రసాదంగా సమర్పిస్తారు. బెల్లం అని అనకుండా బంగారం అని‌ పిలుస్తారు. మరో పది రోజుల పాటు జరుగనున్న జాతర కోసం ఇంకా ఎక్కువగానే బెల్లాన్ని వినియోగిస్తారు. దీంతో ఈ ముడు, నాలుగు రోజులలో‌ బెల్లం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారస్తులు చెబుతున్నారు. అయితే భక్తులు ఇవన్నీ లెక్క జేయకుండా నిలువెత్తు బంగారాన్ని సమర్పించి ‌తమ భక్తి భావాన్ని చాటుకుంటున్నారు.

Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: