Responsive Header with Date and Time

హైద్రబాదీలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చింత అవసరం లేదు.. ఎందుకంటే.....

Category : | Sub Category : తాజా వార్తలు Posted on 2024-02-13 10:39:28


హైద్రబాదీలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చింత అవసరం లేదు.. ఎందుకంటే.....

TWM News :- వరదలొచ్చినా.. ఉప్పెనొచ్చినా.. భారీ అగ్నిప్రమాదాలు సంభవించినా.. బిల్డింగులు కూలినా.. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ టీమ్స్‌ రావాల్సిందే. రెస్క్యూ చేయాల్సిందే. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ టీమ్స్‌ వచ్చే వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమనాల్సిన పరిస్థితి. అయితే ఇదంతా గతం అంటోంది తెలంగాణ ఫైర్‌ డిపార్మెంట్‌. ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు ధీటుగా తమ సిబ్బందిని తీర్చిదిద్దామంటోంది. విపత్తేదైనా.. డోంట్‌ కేర్‌ అంటూ తమ బలగాలు రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాయంటోంది ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌. ఫైర్‌ సిబ్బంది.. ఫైర్‌ బ్రాండ్‌లా ఎలా మారారు.? సాహసోపేతంగా ఎలా తీర్చిదిద్దారు.? ఇప్పుడు తెలుసుకుందాం.

ఫైర్‌.. ఫైర్స్‌ ది ఫైర్‌ ! ఫైర్‌ విల్‌ బి ఫైర్‌ ! ఫైర్‌ అల్వేస్‌ ఫైర్స్‌..!! అంటోంది తెలంగాణ ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌. తమ సిబ్బంది ఒక్కొక్కరు ఒక్కో మిసైల్‌‎గా మారారంటోంది. ప్రమాదమేదైనా.. విపత్తేదైనా.. మేమున్నామంటూ రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నరని చెప్తోంది. అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ.. అప్‌గ్రేడెడ్‌ స్కిల్స్‌తో.. ఫైర్‌ ఫైటర్స్‌ని తీర్చిదిద్దింది తెలంగాణ ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌. అగ్నిప్రమాదాలు జరిగిన వెంటనే.. నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకుని శ్రమిస్తాయి ఫైర్‌ టీమ్స్‌. తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ రెస్క్యూ చేయడం. చిక్కుకున్న వారిని కాపాడటం చేస్తున్నారు ఫైర్‌ ఫైటర్స్‌. అలాంటి ఫైర్‌ సిబ్బందిని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుతోంది తెలంగాణ ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌. కేవలం అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడే కాకుండా.. ఎవరైనా నీటిలో దూకి ఆత్మహత్య చేసుకున్నా.. వరదల్లో చిక్కుక్కున్నా.. బోటు తిరగబడి నీటిలో పడిపోయినా.. కొండలు, క్వారీల్లో చిక్కుకున్నా.. ఎలాంటి ప్రమాదమైనా రెస్క్యూ చేసే విధంగా ఫైర్‌ సిబ్బందిని సిద్ధం చేశారు. వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

ఇండియన్‌ రెస్క్యూ అకాడమీ సహాయంతో.. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో.. తెలంగాణ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌ డిపార్ట్‌మెంట్‌ సంయుక్తంగా ఫైర్‌ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఫైర్‌ ఫైటర్స్‌కు బోట్‌ డ్రైవింగ్‌, స్కూబా డైవింగ్‌, స్విమ్మింగ్‌ టెక్నిక్స్‌, రెస్క్యూ ఆపరేషన్స్‌, రోప్‌ రెస్క్యూ వంటి వాటిపై శిక్షణ ఇచ్చారు. మాదాపూర్‌ దుర్గం చెరువు వద్ద బోట్లతో బోట్‌ డ్రైవింగ్‌లో మెలకువలు నేర్పారు. ఎవరైనా చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడితే ఎలా రక్షించాలో శిక్షణ ఇచ్చారు. బోటు ప్రమాదం జరిగో.. ప్రమాదవశాత్తో ఇద్దరు ముగ్గురు నీటిలో పడితే వాళ్లను ఎలా రక్షించాలి.. అనే వాటిపై ప్రత్యేక ట్రైనర్లతో శిక్షణ ఇచ్చారు. రెస్క్యూకి వెళ్లిన బోటే తిరగబడితే.. వెంటనే బోట్‌‎ను ఎలా రీసెట్‌ చేసుకోవాలి.. అనే దానిపై కూడా ట్రైనింగ్‌ ఇచ్చారు. నీటిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఒడ్డుకు చేర్చడమే కాకుండా.. వారి ప్రాణాలు నిలబెట్టేలా ట్రైనింగ్‌ ఇచ్చారు. నీళ్లు మింగిన వ్యక్తి నోటి నుంచి నీళ్లు బయటకు రావాలంటే.. ఏ పొజిషన్‌లో ఉంచాలి.. ఎక్కడెక్కడ నొక్కితే నీళ్లు బయటకు వస్తాయి.. శ్వాస అందకపోతే నోటితో శ్వాస కృత్రిమంగా ఎలా అందించాలి.. సీపీఆర్‌ ఎలా చేయాలి.. అనే విషయాలపైనా శిక్షణ ఇచ్చారు. కేవలం నీటిలో ప్రమాదవశాత్తు పడిన వారినో.. ఆత్మహత్యకు పాల్పడిన వారినో కాపాడటం కాకుండా.. ఎత్తైన కొండలు, హైరైజ్డ్‌ బిల్డింగ్స్‌, క్వారీలు లాంటి వాటిలో చిక్కుకున్న వారిని ఎలా రక్షించాలో కూడా ఫైర్‌ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.


Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: