Responsive Header with Date and Time

స్మశానంలో ఓట్లు అడుగుతున్నారు.. ఎందుకో తెలుసా..?

Category : | Sub Category : తాజా వార్తలు Posted on 2024-02-12 10:36:17


స్మశానంలో ఓట్లు అడుగుతున్నారు.. ఎందుకో తెలుసా..?

TWM News : అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఒకటి, రెండు నెలల్లో ఎన్నిక‌లు జరగనున్నాయి. అందుకు సంబంధించి ఇప్పటికే తొలి ద‌ఫా ఓట‌ర్ల జాబితా కూడా ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీలో ఐదు కోట్ల పైచిలుకు ప్రజ‌లు ఉంటే.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం విడుదల చేసిన జాబితా ప్రకారం.. 4 కోట్ల పైచిలుకు ఓట‌ర్లు ఉన్నారు. దీనిపై.. టీడీపీ, జనసేన పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లాలో దొంగఓట్లపై వినూత్న నిరసన వ్యక్తం చేశారు ప్రతిపక్ష పార్టీల నేతలు.


ఒకవైపు దొంగ ఓట్లపై ఈసీ కొరడా జులిపిస్తుంటే విపక్షాల నిరసన వినూత్న రీతిలో కొనసాగుతోంది. చంద్రగిరిలో దొంగ ఓట్లపై తిరుపతి రూరల్ మండలం పుదిపట్ల సుధా యాదవ్ వినూత్న రీతిలో నిరసనకు దిగారు. చంద్రగిరి నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు జరిగినట్లు ఇప్పటికే ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు కూడా అందాయి. అయితే ఈ మధ్యనే విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాలోనూ చనిపోయిన వారికి ఓట్లు ఉన్నట్లు గుర్తించిన నేతలు అధికార యంత్రాంగం తీరును తప్పుపడుతూ నిరసన వ్యక్తం చేశారు.

ఓటర్ల జాబితా నుంచి చనిపోయిన వారి ఓట్లను ఇంకా తొలగించకపోవడంతో చంద్రగిరి స్మశానం వాటిక వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు సుధా యాదవ్. చనిపోయిన వారి సమాధుల వద్ద ప్రచారంలో భాగంగా వాల్ క్లాక్, కుక్కర్లు ఇచ్చి తనుకు ఓటే వేయాలని కోరారు. చంద్రగిరి నుంచి టీడీపీ టికెట్‌ను ఆశిస్తున్న బిసి నేత బడి సుధా యాదవ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా చనిపోయిన వారి ఓట్లు తొలగించాలని, బోగస్ ఓట్లను తొలగించాలని ప్లకార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఓటర్ల జాబితాలోని అవకతవకలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: