Responsive Header with Date and Time

వాలెంటైన్స్ డే వేడుకలు వద్దు… వీర జవాన్ల దివాస్‌గా జరపుకోవాలన్న భజరంగ్‌దళ్, వీహెచ్‌పీ

Category : | Sub Category : తాజా వార్తలు Posted on 2024-02-10 10:42:00


వాలెంటైన్స్ డే వేడుకలు వద్దు… వీర జవాన్ల దివాస్‌గా జరపుకోవాలన్న భజరంగ్‌దళ్, వీహెచ్‌పీ

TWM News :-  రోమ్ లో పుట్టి ఖండాంతరాలను దాటుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు పండుగను జరుపుకునేంతగా విస్తరించింది ప్రేమికుల దినోత్సవం. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14 న వాలెంటైన్స్ డేగా జరుపుకుంటారు. అమెరికా, కెనడా, మెక్సికో, యునైటేడ్‌ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, ఇటలీ, డెన్మార్క్, జపాన్‌, చైనా వంటి అనేక దేశాలతో పాటు క్రమంగా ఈ ప్రేమికుల దినోత్సవం భారత దేశంలో కూడా అడుగు పెట్టింది. భారతదేశంలో ప్రేమికుల రోజు దినోత్సవం జరుపుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పాశ్చాత్య దేశాల ప్రభావంతో నేటి యువత ప్రేమ పేరుతో ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారు అంటూ ఈ వాలెంటైన్స్ డే  భారతదేశంలో వ్యతిరేకిస్తున్నారు. దాదాపు ప్రతి సంవత్సరం, నిరసనల కారణంగా భారతదేశంలోని అనేక నగరాల్లో ఫిబ్రవరి 14న శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో  ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ భజరంగ్‌దళ్, విశ్వహిందూ పరిషత్ ఆందోళనకు సిద్ధమవుతోంది. వాలెంటైన్స్ డేకి వ్యతిరేకంగా పోస్టర్​ రిలీజ్‌ చేశారు.

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే జరుపుకుంటారు ప్రేమికులు. దానిలో భాగంగా.. వారం రోజుల పాటు వేడుకలు కూడా నిర్వహిస్తారు. ప్రేమను వ్యక్తీకరించడానికి ఒక్కో రోజును ఒక్కో స్పెషల్‌ డేగా జరుపుకుంటారు. అయితే.. సరిగ్గా ఇలాంటి సమయంలో.. ప్రేమికుల రోజుకు వ్యతిరేకంగా భజరంగ్‌దళ్, విశ్వహిందూ పరిషత్ ఆందోళనకు సిద్ధమవుతోంది. హైదరాబాద్‌లో వాలెంటైన్స్ డేకి వ్యతిరేకంగా ఫిబ్రవరి 14ను వీర జవాన్ల దివాస్‌ అంటూ పోస్టర్​ ఆవిష్కరించారు భజరంగ్‌దళ్, విశ్వహిందూ పరిషత్ నేతలు. విదేశీ సంస్కృతిని బహిష్కరిద్దాం.. దేశ సంస్కృతిని కాపాడుకుందాం.. అంటూ నినాదాలు చేశారు. ఇక.. తాము ప్రేమికులకు వ్యతిరేకం కాదని కార్పొరేట్‌ సంస్థలు చేసే కార్యక్రమాలకు మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు భజరంగ్‌దళ్, వీహెచ్‌పీ నేతలు. పాశ్యాత్య దేశాల సంస్కృతికి యువత దూరంగా ఉండి.. దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని కోరారు.

ప్రేమికుల రోజు పేరుతో పబ్బులు, రిసార్ట్స్‌లో పార్టీలు ఏర్పాటు చేసి కార్పొరేట్ సంస్థలు యువతను చెడగొడుతున్నాయని ఆరోపించారు. అందుకే.. హైదరాబాద్‌ వ్యాప్తంగా ఉన్న పార్కులు, పబ్బులు, కాఫీ షాప్​లు, హోటల్స్​కు ఫిబ్రవరి 14వ తేదీ రోజు ప్రేమికులను అనుమతించొద్దని వినతి పత్రాలు ఇచ్చామని తెలిపారు. ఒకవేళ హెచ్చరికల తర్వాత కూడా ప్రేమికులు బయటకి వస్తే ప్రతీ సంవత్సరం లాగానే అడ్డుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు. మరోవైపు.. ఫిబ్రవరి14నే పుల్వామా దాడిలో 45 మంది వీర జవాన్లు అమరులయ్యారని వారిని స్మరిస్తూ ప్రేమికుల రోజు వేడుకలను యువత బహిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు.. ఫిబ్రవరి 14ను వీర జవాన్ల దివాస్‌గా జరుపుకోవాలని VHP, భజరంగ్ దళ్ నాయకులు కోరారు.

Search
Categories
తాజా వార్తలు
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Leave a Comment: