Responsive Header with Date and Time

Category : వ్యాపారం | Sub Category : జాతీయ Posted on 2024-10-01 16:11:24


TWM News:-అలాంటి బ్రాండ్‌ ఇమేజ్‌ ఉన్న రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి వినియోగదారులకు షాకింగ్‌ అలర్ట్‌ వచ్చింది. 2022 నవంబర్‌ నుంచి మార్చి 2023 మధ్య తయారైన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అన్ని బైక్స్‌ను రీకాల్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ఒక సాధారణ పరీక్షలో మోటార్ సైకిళ్లపై వెనుకవైపు, ఇరు పక్కల  అమర్చిన రిఫ్లెక్టర్లలో సమస్య ఉందని గుర్తించినట్లు కంపెనీ పేర్కొంది.

మన దేశంలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మోటార్‌ సైకిళ్లకు ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్‌ ఉంది. దానిని వినియోగించడం ఓ స్టేటస్‌ సింబల్‌గా భావించే వారు ఉన్నారు. గతంలో బాగా ఉన్నతులే దానిని వినియోగించేవారు. ప్రస్తుతం యువతకు కలల బైక్‌గా అది మారింది. అలాంటి బ్రాండ్‌ ఇమేజ్‌ ఉన్న రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి వినియోగదారులకు షాకింగ్‌ అలర్ట్‌ వచ్చింది. 2022 నవంబర్‌ నుంచి మార్చి 2023 మధ్య తయారైన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అన్ని బైక్స్‌ను రీకాల్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ఒక సాధారణ పరీక్షలో మోటార్ సైకిళ్లపై వెనుకవైపు, ఇరు పక్కల  అమర్చిన రిఫ్లెక్టర్లలో సమస్య ఉందని గుర్తించినట్లు కంపెనీ పేర్కొంది. అవి వాటి స్టాండర్డ్‌కు తగ్గట్లుగా పని చేయడం లేదని, రిఫ్లెక్ట్‌ చేయలేకపోతున్నాయని వివరించింది. తద్వారా వాటిపై పడ్డ కాంతిని ప్రభావంతంగా రిఫ్లెక్ట్‌ చేయకపోవడంతో రైడర్లకు ప్రమాదం పొంచి ఉన్నట్లు చెప్పింది.

ఉచిత రిప్లేస్‌ మెంట్‌..

గ్లోబల్‌ వైడ్‌గా 2022 నవంబర్‌ నుంచి మార్చి 2023 మధ్య తయారైన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అన్ని బైక్స్‌ను రీకాల్‌ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అంతేకాక ఆ వాహనాలలో రిఫ్లెక్టర్లను ఉచితంగా మార్చుతామని ప్రకటించింది. దక్షిణ కొరియా, యునైటెడ్ స్టేట్స్, కెనడాలోని కస్టమర్లతో ప్రారంభించి, భారతదేశం, యూరప్, బ్రెజిల్, లాటిన్ అమెరికా, యూకే వంటి ఇతర ప్రధాన మార్కెట్లను తర్వాత దశల్లో ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు పేర్కొంది.

15 నిమిషాల్లోనే..

మోటార్ సైకిల్ తయారీదారు రిఫ్లెక్టర్ రీప్లేస్మెంట్ అనేదిచాలా చిన్న ప్రక్రియ అని, ఒక్కో మోటార్ సైకిల్కు కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే పడుతుందని వివరించింది. ప్రభావిత మోటార్ సైకిళ్ల కస్టమర్లు రిఫ్లెక్టర్ రీప్లేస్మెంట్ షెడ్యూల్ చేయడానికి రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ టీమ్‌ సంప్రదించాల్సి ఉంటుంది.

మరిన్ని కొత్త బైక్స్‌..

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 యూకేలో కొత్త లుక్లో కనిపించింది. ఇప్పుడు మన దేశంలో లాంచ్‌ చేసేందుకు కంపెనీ సిద్దమైంది. ఈ నేపథ్యంలో ఆ 650సీసీ బైక్‌లో ఏముండవచ్చో స్పష్టమైన చిత్రాన్ని అందిస్తుంది. క్లాసిక్ 350 డిజైన్ లాంగ్వేజ్ ను అనుసరించి, ఆర్‌ఈ క్లాసిక్ 650 మడ్‌గార్డు, వృత్తాకార హెడ్‌ల్యాంప్, విలక్షణమైన టెయిల్ లైట్‌తో సహా అనేక రెట్రో డిజైన్ ఎలిమెంట్లను కలిగి ఉంది. ఈ డిజైన్ ఫిలాసఫీ రాయల్ ఎన్‌ఫీల్డ్‌ వారసత్వానికి కట్టుబడి ఉంటుంది. క్లాసిక్ 650 ఇప్పటికే ఇంటర్ సెప్టర్, కాంటినెంటల్ జీటీ, సూపర్ మెటోర్ 650, షాట్రన్ 650లను కలిగి ఉంది. ఆ రాయల్ ఎన్ఫీల్డ్ 650సీసీ లైనప్లో ఈ కొత్త బైక్‌ కూడా చేరనుంది.


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
తాజా వార్తలు
Leave a Comment: