Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2024-09-26 18:06:34
తెలుగు వెబ్ మీడియా న్యూస్: మరో 30 రోజుల్లో ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దుర్గాబాయి దేశముఖ్ రెనోవా క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. విద్య, ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. పేదలకు అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించాల్సి ఉంది. ప్రతి ఒక్కరికీ విడివిడిగా హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలి. రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల హెల్త్ ప్రొఫైల్స్ ను డిజిటలైజ్ చేయాల్సి ఉంది. ఈ హెల్త్ కార్డుల్లో గత చికిత్స వివరాలు పొందుపరుస్తారు అని తెలిపారు. దుర్గాబాయి దేశముఖ్ సంఘం ప్రతినిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో భాగం కావాలని కోరారు.