Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2024-09-26 17:58:02
తెలుగు వెబ్ మీడియా న్యూస్: ఇటీవల వైకాపాకు రాజీనామా చేసిన కీలక నేతలు ముగ్గురు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో గురువారం ఆ పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్డ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్యకు పవన్ కల్యాణ్ పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. నేతల వెంట వందలాదిగా కార్యకర్తలు జనసేన కార్యాలయానికి తరలివచ్చారు.