Category : క్రీడలు | Sub Category : జాతీయ Posted on 2024-09-26 16:31:25
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు దూరమైన టీమిండియా పేసర్ మహ్మద్ షమీ ప్రస్తుతం ఫిట్‌నెస్ కసరత్తుల్లో నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలో షమీ సోషల్ మీడియాలో ఓ ఫొటో షేర్ చేశాడు. అది కూడా భారత జట్టు మాజీ పేసర్‌తో కావడం విశేషం. అయితే, ఈ ఫొటో చూసిన చాలా మందికి షమీతో ఉన్న మాజీ ఆటగాడు ఎవరంటూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే టీమిండియా మాజీ పేసర్ లుక్ మొత్తం మారిపోయింది. ముఖ్యంగా భారత్ తరపున ఆడుతున్నప్పుడు సన్నగా ఉండే ఆటగాడు రిటైర్మెంట్ తర్వాత తన లుక్ మార్చుకున్నాడు. అందుకే షమీతో ఆటగాడు ఎవరన్నదానిపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.
ఇప్పుడు ఈ చర్చకు బ్రేక్ పడింది. మహ్మద్ షమీతో కనిపించిన టీమిండియా మాజీ ఆటగాడు పేరు అశోక్ దిండా. భారత్ తరపున 22 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన దిండా 2021లో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. షమీ షేర్ చేసిన ఫొటో ద్వారా అశోక్ దిండా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాడు.
అశోక్ దిండా భారత్ తరపున 13 వన్డేలు ఆడి 12 వికెట్లు పడగొట్టాడు. అలాగే టీమిండియా తరపున 9 టీ20 మ్యాచ్‌లు ఆడి 17 వికెట్లు పడగొట్టడంలో సఫలమయ్యాడు. అలాగే, అతను 78 ఐపీఎల్ మ్యాచ్‌ల నుంచి మొత్తం 69 వికెట్లు తీశాడు. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అశోక్ దిండా ఇప్పుడు రిటైర్మెంట్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.బంగ్లాదేశ్‌తో 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు అందుబాటులో లేని మహ్మద్ షమీ, న్యూజిలాండ్‌తో జరగనున్న సిరీస్‌లో కనిపించడం అనుమానంగా ఉంది. ఎందుకంటే, పూర్తి ఫిట్ నెస్ సాధించకుండా మళ్లీ మైదానంలోకి రానని షమీ చెప్పాడు. కాబట్టి, ఆస్ట్రేలియాతో సిరీస్‌తో మహ్మద్ షమీ పునరాగమనం చేస్తారని ఆశించవచ్చు.