Category : క్రీడలు | Sub Category : అంతర్జాతీయ Posted on 2024-09-26 16:11:52
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 25వ మ్యాచ్‌లో నికోలస్ పూరన్ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించాడు. ఈ తుఫాన్ బ్యాటింగ్‌తో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే ఇన్నింగ్స్ ప్రారంభించిన సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ తరపున ఆండ్రీ ఫ్లెచర్, కైల్ మేయర్స్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడారు. ఓపెనర్ ఫ్లెచర్ 61 బంతుల్లో 6 భారీ సిక్సర్లు, 4 ఫోర్లతో 93 పరుగులు చేశాడు. మూడో స్థానంలో వచ్చిన కైల్ మేయర్స్ ట్రిన్ బాగో నైట్ రైడర్స్ బౌలర్లను చిత్తు చేశాడు.కైల్ మేయర్స్ కేవలం 30 బంతుల్లో 3 సిక్సర్లు, 8 ఫోర్లతో 60 పరుగులు చేశాడు. దీంతో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.194 పరుగుల కఠినమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జాసన్ రాయ్‌తో కలిసి శుభారంభం చేసింది. తొలి ఓవర్‌లోనే రాయ్ 34 బంతుల్లో 4 సిక్సర్లు, 6 ఫోర్లతో 64 పరుగులు చేసి భారీ ఛేజింగ్‌కు గట్టి పునాది వేశాడు.
ఆ తర్వాత బరిలోకి దిగిన నికోలస్ పూరన్ బ్యాటింగ్ కొనసాగించాడు. పూరన్ బౌలర్లను ఉతికారేశాడు. మైదానంలోని ప్రతి మూలకు బౌండరీలను పంపించాడు. సిక్స్-ఫోర్ల మోతతో ఊగిపోయాడు. అతను కేవలం 43 బంతుల్లో 7 భారీ సిక్సర్లు, 6 ఫోర్లతో అజేయంగా 93 పరుగులు చేశాడు.నికోలస్ పూరన్ తుఫాన్ బ్యాటింగ్‌తో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ 18.3 ఓవర్లలో 197 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అలాగే, ఈ విజయంతో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టు కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ప్లేఆఫ్ దశకు చేరుకుంది.