Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2024-09-26 15:18:52
తెలుగు వెబ్ మీడియా న్యూస్: ముంబయి నటి కాదంబరీ జెత్వానీ కేసులో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ లను సస్పెండ్ చేసినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. తప్పు చేసిన ఎవరి ని వదిలే ప్రసక్తే లేదన్నారు. కేసులో కొంత మంది పోలీసులను విచారిస్తున్నామని తెలిపారు. విచారణలో బాధ్యులని తేలితే చర్యలుంటాయని చెప్పారు. కేసును సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గా తీసుకున్నారని అనిత పేర్కొన్నారు.