Responsive Header with Date and Time

Category : నేర | Sub Category : తెలంగాణ Posted on 2024-09-26 13:02:49


తెలంగాణలో డ్రగ్స్‌ని నిర్మూలించాలని అటు ప్రభుత్వం, ఇటు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రతిరోజు గంజాయితోపాటు డ్రగ్స్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా నమోదవుతున్న డ్రగ్స్ కేసు గణాంకాలను ఆందోళన కలిగస్తున్నాయన్నారు సీఎం రేవంత్. ఇందులో ఆందోళన కలిగించే అంశంగా ఎక్కువ సంఖ్యలో ఇంజనీరింగ్ విద్యార్థులు దొరుకుతుండటం బాధాకరమని సీఎం రేవంత్ అన్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని పట్టాతో బయటికి వస్తున్న విద్యార్థులు ఉద్యోగాల దొరక్క చివరికి మత్తుకు బానిస అవుతున్నారన్నారు. ఇంజనీరింగ్ కళాశాలలో ప్రామాణికాలు సరైన స్థితిలో లేకపోవడమే ఇందుకు కారణమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.ప్రతి ఏటా ఇంజనీరింగ్ కళాశాల నుండి బయటకు వచ్చే విద్యార్థులు గ్రాడ్యుయేట్ డిగ్రీతో బయటకి వస్తున్నారు తప్పితే, ఉద్యోగ అవకాశాలు తక్కువగా వినియోగించుకుంటున్నారని సీఎం అన్నారు. సరైన విద్యాబోధన లేకపోవడం కళాశాలలో సరైన వసతులు లేకపోవడం కూడా విద్యార్థిని చదువు నుండి పక్కదో పట్టించే పరిస్థితులకు అద్దం పడుతుందని సీఎం రేవంత్ అన్నారు. విద్యార్థులపై సరైన శ్రద్ధ తీసుకోకుంటే ఇంజనీరింగ్ కళాశాలల అనుమతిని రద్దు చేస్తామని యాజమాన్యాలకు ముఖ్యమంత్రి గట్టి హెచ్చరిక జారీ చేశారు.ఇటీవల గంజాయి సేవిస్తూ దొరికిన విద్యార్థుల కంటే అమ్ముతూ పట్టుబడుతున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉందని సీఎం రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మత్తును వదిలించేందుకు తెలంగాణ నార్కోటిక్ బ్యూరోతో పాటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని బలోపేతం చేసినప్పటికీ ప్రతిరోజు కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఇందులో విద్యార్థులు మొదట మత్తుకు బానిసలుగా మారి ఆ తరువాత వారే మత్తు విక్రయాలు జరుపుతున్నారని సీఎం రేవంత్ తెలిపారు.కొద్దిరోజల క్రితం ఎక్సైజ్ పోలీసులు జరిపిన సోదాల్లో ఎస్ఆర్ నగర్ లో ఉన్న ఒక హాస్టల్లో ఐఐటీ విద్యార్థి సైతం గంజాయి విక్రయాలు జరుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు.. కొద్ది నెలల క్రితం ఉస్మానియా మెడికల్ కాలేజీకి సంబంధించిన పలువురు విద్యార్థులు గంజాయిని సేవిస్తూ పట్టుబడ్డారు. ఇంజనీరింగ్ కళాశాలల పరిసరాలను టార్గెట్‌గా చేసుకొని మత్తు ముఠాలు విక్రయాలు చేస్తున్నాయి. కళాశాలలో చదివే విద్యార్థులను మొదట మత్తుకు బానిసలుగా మార్చి ఆ తర్వాత వారిని ఏజెంట్లు గానీ నియమించుకొని మత్తూ దందాను చాప కింద నీరులా విస్తరిస్తున్నారు.

ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని సీఎం హెచ్చరించారు. విద్యాబోధన మొదలుకొని విద్యార్థి క్రమశిక్షణలో పెట్టే బాధ్యత యాజమాన్యానిదే అని సీఎం రేవంత్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం మరో పంజాబ్ లా కాకూడదంటే ఇంజనీరింగ్ కళాశాలలను బాగు చేయాల్సిందే అని రేవంత్ రెడ్డికి తెలిపారు. ఇప్పటికే ఆపరేషన్ దూల్‌పేట్ పేరుతో తెలంగాణ రాష్ట్రానికి సరఫరా అవుతున్న గంజాయి ను సగం వరకు నిర్మూలించగలిగారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుండి వస్తున్న గంజాయి వాహనాలను ఎప్పటికప్పుడు పోలీసులు అడ్డుకుంటూనే ఉన్నారు.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
తాజా వార్తలు
Leave a Comment: