Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2024-09-26 12:48:11
తెలుగు వెబ్ మీడియా న్యూస్: ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలను హెచ్చరించారు. నామినేటెడ్ పదవులు రాని కొందరు పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యల పైన చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇవ్వాల్సిన పదవులు చాలా ఉన్నాయని చెప్పారు. దశల వారీగా ఇస్తామని వెల్లడించారు. కొందరు నాయకులు ఎక్కువ మాట్లాడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేసారు. క్రమశిక్షణ తప్పితే కఠినంగా ఉంటానని హెచ్చరించారు. పార్టీలో క్రమశిక్షణను అందరూ పాటించాలని సూచించారు. కొందరు నాయకులు ఎక్కువ మాట్లాడుతున్నారని హెచ్చరించారు.