Category : వ్యాపారం | Sub Category : జాతీయ Posted on 2024-09-25 11:31:40
TWM News:-Gold Price Today: బంగారం ధరల్లో మళ్లీ అనూహ్యమైన పెరుగుదల కనిపిస్తోంది. ఒకానొక సమయంలో తులం బంగారం ధర రూ. 80 వేలకు చేరువై అందరినీ షాక్‌కి గురి చేసింది. అయితే, ఆ తర్వాత క్రమంగా బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. మళ్లీ రూ. 70 వేల మార్కుకు చేరువైంది. అయతే తాజాగా మళ్లీ బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ఆకాశమే హద్దుగా గోల్డ్ రేట్స్ దూసుకుపోతున్నాయి. దీంతో తులం బంగారం ధర మళ్లీ రూ. 76వేల మార్క్‌ను దాటేసి పరుగులు పెడుతోంది. మరి బుధవారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 70,160గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.76,520ల వద్ద కొనసాగుతోంది. ఇక ఆర్థిక రాజధాని ముంబయి విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 70,010లుకాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 76,370ల వద్ద కొనసాగుతోంది. అలాగే చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 70,010, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 76,370లవద్ద కొసాగుతోంది.
అదే విధంలో మరో ప్రధాన నగరమైన బెంగళూరులో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,010లు కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 76,370ల వద్ద కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 70,010లు ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 76,370 వద్ద కొనసాగుతోంది. విజయవాడతో పాటు, విశాఖలోనూనే 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 70,010లు కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 76,370 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
బంగారం ధర పెరిగితే వెండి ధరలో స్వల్ప తగ్గుదల కనిపించింది. బుధవారం కిలో వెండిపై రూ. 100 తగ్గింది. దీంతో ఢిల్లీతోపాటు ముంబయి, పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 92,800 వద్ద కొనసాగుతోంది. ఇదిలా ఉంటే చెన్నై, హైదరాబాద్, కేరళ, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర అత్యధికంగా రూ. 97,900 వద్ద కొనసాగుతోంది.