Category : రాజకీయాలు | Sub Category : జిల్లా వార్తలు Posted on 2024-09-24 18:08:02
తెలుగు వెబ్ మీడియా న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్శాఖ సిద్ధమవుతోంది. రెండు.. మూడు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముంది. రాష్ట్రంలో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నడిపేలా గత ప్రభుత్వం చట్టం చేసింది. ఆ చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ తెచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్డినెన్స్ ఆమోదం కోసం సవరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ వద్దకు పంపనుంది. రేపటిలోగా గవర్నర్ ఆమోదం తెలిపే అవకాశముంది. రాష్ట్రంలో మొత్తం 3,736 మద్యం షాపులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇందులో 34 షాపులు కల్లుగీత వృత్తి దారులకు కేటాయించనున్నారు. రిజర్వేషన్ల కోటాలోని షాపులను ఎక్కడెక్కడ కేటాయించాలన్న అంశంపై అధికారి శాఖ కసరత్తు చేస్తోంది. కల్లుగీత వృత్తి కులాల జనాభా ఏయే జిల్లాల్లో ఏ మేరకు ఉన్నారనే అంశంపై ఆరా తీస్తున్నారు. కల్లుగీత వృత్తి కులాల జనాభా ప్రాతిపదికనే మద్యం షాపులను ఎక్సైజ్ శాఖ రిజర్వు చేయనుంది.