Category : జాతీయ |
Sub Category : రాజకీయం Posted on 2024-09-24 15:06:07
రిజర్వేషన్లను రక్షించే ఏకైక వ్యక్తి మోదీనే అమిత్ షా వ్యాఖ్యలు
తెలుగు వెబ్ మీడియా న్యూస్: కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేకి అని, కుమారి సెల్టా వంటి పలువురు నేతలను అవమానించిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత వరకూ బాబా సాహెబ్ అంబేడ్కర్ కు భారతరత్న ఇవ్వలేదని పేర్కొన్నారు. తాము ఆయనను గౌరవించేందుకు పంచతీర్థాన్ని స్థాపించామని, సంవిధాన్ దివస్ ప్రకటించామని తెలిపారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తోహానాలో సోమవారం నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న షా, కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రిజర్వేషన్లపై ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. అభివృద్ధి తర్వాత రిజర్వేషన్లు అవసరం లేదని రాహుల్ గాంధీ అమెరికాలో మాట్లాడారు. వారి (కాంగ్రెస్) అభివృద్ధి తర్వాత రిజర్వేషన్లను ఎత్తివేస్తారు. ఎస్సీ, ఓబీసీ రిజర్వేషన్లను రక్షించగల వ్యక్తి ఎవరైనా ఉంటే అది ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమే అని అమిత్ షా పేర్కొన్నారు.