Responsive Header with Date and Time

Category : ఇతర | Sub Category : ఇతర వార్తలు Posted on 2024-09-24 12:56:09


TWM News:-సమోసాలు అనగానే మనందరం లొట్టలేసుకుని తింటుంటాం. అయితే బయట తయారు చేసే ఆహారాలు పరిశుభ్రంగా ఉండవని తెలిసినా మానుకోం. తాజాగా ఓ వ్యక్తి సమోసాల కోసం బంగాళాదుంపలను కడుగుతున్న పద్ధతి చూస్తే షాక్‌ అవ్వాల్సిందే.

సమోసాలు అనగానే మనందరం లొట్టలేసుకుని తింటుంటాం. సమోసాల కోసం పొడవాటి క్యూలో నిలబడి కస్టమర్లకు చెమటలు కూడా పడుతుంటాయి. ఒక్కోసారి ఒక్క సమోసా కోసం జనాలు చాలాసేపు లైన్‌లో వేచి ఉండాల్సి వస్తుంది. పెరుగుతున్న కస్టమర్ల రద్దీని చూసి, దుకాణదారుడిలో ఆందోళన కూడా పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో సమోసా తయారీలో అక్కడి కార్మికులు ఎలాంటి పరిశుభ్రత నియమాలు పాటించకుండా పనిచేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అనేక సంఘటనలు సోసల్ మీడియాలో వైరల్‌ కావటం మనం చూశాం. తాజాగా సమోసా తయారీకి సంబంధించిన ఒక వీడియో నెటిజన్లను ఆందోళనకు గురి చేస్తోంది.

సమోసాలు అనగానే మనందరం లొట్టలేసుకుని తింటుంటాం. అయితే బయట తయారు చేసే ఆహారాలు పరిశుభ్రంగా ఉండవని తెలిసినా మానుకోం. తాజాగా ఓ వ్యక్తి సమోసాల కోసం బంగాళాదుంపలను కడుగుతున్న పద్ధతి చూస్తే షాక్‌ అవ్వాల్సిందే. ఓ పెద్ద పాత్రలో బంగాళాదుంపలను వేసి దాంట్లో నీరు పోసి కాళ్లతో తొక్కుతూ శుభ్రం చేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

గతంలోనూ ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో సమోసాలో కప్ప ప్రత్యక్షమైంది. ఓ వ్యక్తి రోడ్డు పక్కన ఉన్న దుకాణంలో ఘుమఘుమలాడుతున్న గరం గరం సమోసాలు కొన్నాడు. ఇక దాన్ని చిన్న ముక్క కొరికేసరికి.. లోపల కనిపించింది చూసి దెబ్బకు షాక్ తిన్నాడు. అందులో చనిపోయిన ఓ కప్ప కళేబరాన్ని గుర్తించాడు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
Leave a Comment: