Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2024-09-23 14:36:02
ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. వచ్చే ఏడాది మార్చి 28న మూవీ విడుదల కానుంది. ఇవాళ్టి నుంచి విజయవాడలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. విజయవాడలో ఇప్పటికే సెట్‌లు కూడా రెడీ చేశారు. ఇవాళ ఉదయం 7 గంటలకు లాంఛనంగా షూటింగ్ మొదలుపెట్టారు. డిప్యూటీ సీఎంగా అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు పవన్ కల్యాణ్.. అటు పాలనాపరమైన అంశాలు.. ఇటు సినిమాలు రెండూ బ్యాలెన్స్ చేయడం కష్టంగా మారిన పరిస్థితుల్లో.. పవన్ ఉంటున్న విజయవాడలోనే సినిమా కోసం సెట్‌లు రెడీ చేశారు. హైదరాబాద్- విజయవాడ షెటిల్ సర్వీస్ చేసే పని లేకుండా బెజవాడలోనే సినిమా షూటింగ్ చేయబోతున్నారు. హరిహర వీరమల్లు సినిమా ముందుగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలైంది.. కానీ ఇప్పుడు.. ఈ ప్రాజెక్ట్‌ని జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ కెరీర్‌లో ఇది ఫస్ట్ పాన్‌ఇండియా సినిమా అవబోతోంది. హరిహరవీరమల్లు సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.ఇటీవల చిత్ర యూనిట్ అంతా పవన్‌ని కలిసి షెడ్యూల్‌పై చర్చించింది. AM రత్నం సమర్పణలో ఈ హరిహరవీరమల్లు సినిమా వస్తోంది. అన్‌స్టాపబుల్ ఫోర్స్, అన్ బ్రేకబుల్ స్పిరిట్ అంటూ ఇప్పుడు రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్..
పవన్ 2023 జులైలో ఆఖరుసారిగా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించారు. బ్రో సినిమా తర్వాత ఫుల్‌గా రాజకీయాల్లో బిజీ అయిపోయారు.. ప్రస్తుతం పవన్ దగ్గర 3 ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఇటు అధికారిక కార్యక్రమాల్ని బ్యాలెన్స్ చేసుకుంటూనే.. వాటిని స్పీడ్‌గా కంప్లీట్ చేసేందుకు విజయవాడలోనే షూటింగ్‌కి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇవాళ హరిహరవీరమల్లు షూటింగ్ మొదలైంది. అలాగే OG, ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాలు కూడా క్యూలైన్‌లో ఉన్నాయి. వీటి షూటింగ్‌కి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారనేది త్వరలోనే క్లారిటీ రాబోతోంది. తాజా పరిణామాలు బట్టి చూస్తుంటే ఇకపై ఏపీలోనూ షూటింగ్‌లు పెరిగే అవకాశం కనిపిస్తోంది.. గతంలో రాజమండ్రి, వైజాగ్‌లో రెగ్యులర్‌గా షూటింగ్‌లు జరిగేవి.. ఏజెన్సీ ప్రాంతం కూడా షూటింగ్‌లకు కేరాఫ్‌గా ఉండేది. ఇప్పుడు విజయవాడలో కూడా షూటింగ్స్ కళ కనిపించబోతోంది.