Responsive Header with Date and Time

Category : ఇతర | Sub Category : ఇతర వార్తలు Posted on 2024-09-23 13:47:05


TWM News:-చక్కెర లానే.. మీరు ఒక నెల పాటు ఉప్పును పూర్తిగా వదులుకుంటే, అది శరీరానికి ఎలాంటి మేలు లేదా హాని చేస్తుందో మీరెప్పుడైనా ఆలోచించారా..? ఇప్పటివరకు ఇలాంటి సందేహం రాకపోయినా.. తేలియకపోయినా.. ఈ కథనాన్ని పూర్తిగా చదవండి..

ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. ఈ తరుణంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.. అయితే.. బరువు తగ్గడానికి, మంచి ఆరోగ్యానికి చక్కెరను నివారించాలని ఆరోగ్య నిపుణులు తరచుగా సిఫార్సు చేస్తారు.. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. చక్కెర లానే.. మీరు ఒక నెల పాటు ఉప్పును పూర్తిగా వదులుకుంటే, అది శరీరానికి ఎలాంటి మేలు లేదా హాని చేస్తుందో మీరెప్పుడైనా ఆలోచించారా..? ఇప్పటివరకు ఇలాంటి సందేహం రాకపోయినా.. తేలియకపోయినా.. ఈ కథనాన్ని పూర్తిగా చదవండి..

ఒక నెల పాటు ఉప్పును వదిలేస్తే శరీరంపై నమ్మలేని విధంగా ప్రభావం చూపుతుంది.. మతపరమైన ఉపవాసం అయినా లేదా ఆరోగ్య ప్రణాళికలో భాగమైనా.. కొన్ని సందర్భాల్లో జంక్ ఫుడ్‌ (ఉప్పు పదార్థాలు) ను వదులుకోవడం సర్వసాధారణం. అయితే, ఇది మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం.. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి ఒక రోజులో 4 గ్రాముల ఉప్పు కంటే ఎక్కువ తినకూడదు.. అయితే ఉప్పును పూర్తిగా నిషేధిస్తే ఏం జరుగుతుంది.. డైటీషియన్లు ఏం చెబుతున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

వాస్తవానికి ఉప్పు మన శరీరానికి అవసరమైన పోషకం.. లవణాన్ని తగిన పరిమాణంలో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే.. కానీ.. మానేస్తే మాత్రం చాలా దుష్ప్రభావాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని, ప్రాణాలతో చెలగాటం ఆడినట్లేనని వైద్య నిపుణుల చెబుతున్నారు. దీర్ఘకాలం పాటు ఉప్పు తీసుకోకపోతే.. ఒక్కోసారి కోమాలోకి వెళ్లడంతోపాటు ప్రాణాలు కూడా పోతాయని పేర్కొంటున్నారు.

మీరు 30 రోజులు ఉప్పును తినకపోతే.. జరిగేది ఇదే..

అమాంతం బరువు తగ్గుతుంది..

జంక్ ఫుడ్ మానేయడం వల్ల వచ్చే మొదటి ప్రభావం బరువు తగ్గడం.. మీరు 30 రోజులు తినడం మానేసినప్పుడు మీ శరీరం తక్కువ తినడానికి అలవాటుపడుతుంది. ఇది మీ పొట్ట, నడుము కొవ్వు (బెల్లీ ఫ్యాట్) ను తగ్గిస్తుంది. అయితే, అసాధారణంగా బరువు తగ్గితే మీ ఆరోగ్యం మరింత క్షీణించవచ్చని మీరు గుర్తుంచుకోవాలి.

జీర్ణక్రియలో సమస్య..

ఒక నెలపాటు జంక్ ఫుడ్ మానేయడం కూడా మీ శరీరంలోని వివిధ వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. ఇది మీ జీర్ణవ్యవస్థలో సమస్యలను కలిగిస్తుంది.. మీ ప్రేగులను ప్రభావితం చేస్తుంది.. కడుపు నొప్పి లేదా ఇతర వ్యాధుల ప్రమాదాన్ని కలిగిస్తుంది.

మానసిక ఆరోగ్య సమస్య..

మానసిక ఆరోగ్యం పరంగా చూస్తే ఉప్పు తినడం పూర్తిగా మానేస్తే.. అది మీ మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. మీరు ఒత్తిడి, లోబీపీ, ఆందోళనకు గురవుతారు. అంటే పరిమిత పరిమాణంలో ఉప్పు తీసుకోవడం అవసరం…

దీన్ని గుర్తుంచుకోండి

ఒక నెల పాటు ఉప్పును పూర్తిగా నివారించడం హానికరం అని మీరు అర్థం చేసుకోవాలి.. కాబట్టి మీరు అలా చేసే ముందు చాలా ఆలోచించాలి.. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను అర్థం చేసుకోవాలి. ఇది కాకుండా, మీరు మీ వైద్యుడిని, డైటీషియన్‌ను సంప్రదించడం మంచిది. ఉప్పులో సోడియం ఉంటుంది. ఇది మన శరీరానికి అవసరమైన పోషకం. దాని లోపం మంచిది కాదు.. అందుకే.. దానిని పరిమిత పరిమాణంలో తీసుకోవాలి.


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
Leave a Comment: