Responsive Header with Date and Time

Category : క్రీడలు | Sub Category : అంతర్జాతీయ Posted on 2024-09-23 13:44:08


యూఏఈ  వేదికగా ఆఫ్ఘనిస్థాన్, దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లోని మొదటి రెండు వన్డేలను ఆఫ్ఘనిస్తాన్ జైత్రయాత్ర కొనసాగించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో దక్షిణాఫ్రికాపై వారికిది మొట్టమొదటి సిరీస్ విజయం. ఇక షార్జా వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లకు 4 వికెట్ల నష్టపోయి 311 పరుగులు చేసింది. ఆ జట్టు భారీ స్కోర్ సాధించడంలో 22 ఏళ్ల ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ ప్రధాన పాత్ర పోషించాడు. చారిత్రక సెంచరీతో అటు విరాట్ కోహ్లీ, ఇటు బాబర్ ఆజామ్‌లను పక్కనపెట్టేశాడు ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్.మొదటి మ్యాచ్‌లో డకౌట్ అయిన గుర్బాజ్.. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. 110 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 105 పరుగులతో రాణించాడు. ఇక రహ్మానుల్లా గుర్బాజ్‌కి ఈ సెంచరీ ఎంతో ప్రత్యేకమైనది. వన్డే క్రికెట్‌లో అతనికిది 7వ సెంచరీ కాగా.. ఈ శతకంతో ఆఫ్ఘనిస్తాన్ తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా అవతరించాడు గుర్బాజ్. దీంతో గతంలో మహ్మద్ షాజాద్(6 సెంచరీలు) రికార్డును బద్దలు కొట్టాడు. 22 ఏళ్ల వయసులో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాడిగా రహ్మానుల్లా గుర్బాజ్.. పాకిస్థాన్ ప్లేయర్ బాబర్ అజామ్‌ను అధిగమించాడు. బాబర్ అజామ్ 22 సంవత్సరాలకు 6 వన్డే సెంచరీలు సాధించాడు. అదే సమయంలో ఈ జాబితాలో విరాట్ కోహ్లీని గుర్బాజ్ సమం చేశాడు. 22 ఏళ్ల వయసులో విరాట్ కోహ్లీ కేవలం 7 వన్డే సెంచరీలు చేశాడు. ఇక్కడొక ఆసక్తికర విషయమేంటంటే.. తాను క్రికెట్‌లోకి రావడానికి ధోనినే కారణమని.. అతడి బ్యాటింగ్ స్టైల్ తనను ఇన్‌స్పైర్ చేస్తుందని గుర్బాజ్ పలు ఇంటర్వ్యూలలో పేర్కొన్న సంగతి తెలిసిందే.అంతకముందు ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. రెహ్మానుల్లా గుర్బాజ్‌తో పాటు, అజ్మతుల్లా ఉమర్జాయ్ 50 బంతుల్లో 86 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో అతడు 5 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. అదే సమయంలో రహ్మత్ షా కూడా 50 పరుగులు సాధించాడు. ఇక ఈ భారీ లక్ష్యచేధనలో దక్షిణాఫ్రికా చతికిలబడింది. 34.2 ఓవర్లలో కేవలం 134 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ బావుమా 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 5 వికెట్లు, ఖరోతే 4 వికెట్లు, ఒమరజై 1 వికెట్ పడగొట్టాడు.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
Leave a Comment: