Responsive Header with Date and Time

Category : క్రీడలు | Sub Category : అంతర్జాతీయ Posted on 2024-09-23 13:33:46


వన్డే క్రికెట్‌లో సరికొత్త చరిత్రను సృష్టించింది ఆఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ జట్టు. క్రికెట్‌లో పసికూనగా చెప్పుకునే ఆఘ్గనిస్థాన్‌, సౌతాఫిక్రాపై ఊహించని విజయాన్ని నమోదు చేసుకుంది. ఊహకందని విధంగా వన్డీ సిరీస్‌ను కైవసం చేసుకుంది. తాజాగా శుక్రవారం షార్జా వేదికగా జరిగిన రెన్డో వన్డేలో దక్షిణాఫిక్రాపై 177 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో ఇంకో వన్డే మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది.మ్యాచ్‌ విషయానికొస్తే.. 

 రెండో వన్డేలో తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆప్ఘానిస్థాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. ఓపెన‌ర్ ర‌హ్మ‌నుల్లా గుర్బాజ్‌105 పరుగులు చేసి సెంచ‌రీతో ఆకట్టుకోగా, అజ్మతుల్లా ఓమ‌ర్‌జాయ్ 86 పరుగులు, ర‌హ్మ‌త్ షా 50 పరుగులు చేయడంతో అఫ్గానిస్థాన్‌ భారీ స్కోర్ సాధించింది. ఇక 312 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికలో తొలి నుంచి తడబడింది. ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.ఆఫ్గానిస్థాన్‌ బౌలర్ల దాటికి వరుసగా వికెట్లను సమర్పించుకుంది. నిర్ణీత 34.2 ఓవర్లలో కేవలం134 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఆ జట్టు తరుపున కెప్టెన్ టెంబ బవుమా ఒక్కడే 38 పరుగులు చేయడం గమనార్హం. ఇక అఫ్గానిస్థాన్‌ బౌలింగ్ విషయానికొస్తే.. రషీద్ ఖాన్ 5 వికెట్లు తీయగా, ఖరోటే 4 వికెట్లు పడగొట్టాడు. 5 వికెట్లు తీసి మ్యాచ్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన రషీద్ ఖాన్‌కు ‘మ్యాన్ అఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. మూడు మ్యాచుల సిరీస్ లో భాగంగా నామమాత్రమైన చివరి వన్డే షార్జా వేదికగా ఆదివారం జరగనుంది.ఇదే ఆఫ్గానిస్థాన్‌ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. సౌతాఫిక్రాపై గెలుపుతో సెనా (సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా) దేశాలన్నిటిపై వన్డేల్లో విజయాలు నమోదు చేసుకున్న రికార్డును సొంతం చేసుకుంది. కాగా ఈ విజయాలన్ని గత ఏడాదిలోనే కావడం విశేషం. ఇదలా ఉంటే 2024 టీ20 వరల్డ్‌ కప్‌లో కూడా ఆఫ్గనిస్థాన్‌ మెరుగైన ఆటతీరును కనబరిచి సెమీఫైనల్స్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
Leave a Comment: