Responsive Header with Date and Time

Category : నేర | Sub Category : జాతీయ Posted on 2024-09-19 18:02:02


కర్ణాటకలోని బెంగళూరులో చిరుత పులి సంచారం మరోసారి కలకలం రేపుతోంది. తుమకూరు రోడ్..హోసూర్ రోడ్ మధ్య ఫేజ్ 1 టోల్ ప్లాజ్ ఉంది. ఆ టోల్ ప్లాజా దగ్గరలో రోడ్డు దాటుతూ చిరుత కనిపించడం స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. చిరుతపులి కాంపౌండ్ ప్రక్కన దగ్గర నడుస్తూ కనిపించింది. కాని ఆ తరువాత ఎక్కడికి వెళ్లిందో తెలియలేదు.మంగళవారం ఉదయం తెల్లవారుజామున 3.00 గంటలకు చిరుతపులి టోల్‌ప్లాజా సమీపంలోని ఫ్లైఓవర్‌ను దాటుతున్నట్లు టోల్ ఫ్లాజా అధికారులు గుర్తించారు. పనక్ ఇండియా కంపెనీ ప్రాంతం నుండి నెట్టూర్ టెక్నికల్ ట్రైనింగ్ ఫౌండేషన్ (ఎన్ టీటీ ఎఫ్ ) వైపు చిరుత పులి వెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఎన్టీటీఎఫ్ ప్రిన్సిపల్ సునీల్ జోషి మాట్లాడుతూ..  టోల్ గేట్ సమీపంలోని కెమెరాలో కాంపౌండ్ వాల్ దగ్గర నుండి చిరుతపులి వెళ్ళినట్లు మాకు సమాచారం వచ్చింది. వెంటనే మేం ఇనిస్టిట్యూట్ లలో అన్నీ గదులను, సీసీటీవీ ఫుటేజీలను చెక్‌ చేశామని చెప్పారు..ఎక్కడా పులి ఆనవాళ్లు కనిపించలేదన్నారు. క్యాంపస్‌లో ముందస్తు తనిఖీలు నిర్వహించామని, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చామని చెప్పారు. అటవీ శాఖ అధికారులు క్యాంపస్ ను పరిశీలించారు. చిరుతపులి కాంపౌండ్‌కు చాలా దగ్గర నడుస్తూ కనిపించింది. కాని ఆ తరువాత ఎక్కడికి వెళ్లిందో తెలియలేదని అన్నారు.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
తాజా వార్తలు
Leave a Comment: