Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2024-09-19 17:59:02
తెలుగు వెబ్ మీడియా న్యూస్: బిచ్చగాడు తో తెలుగువారికి చేరువైన కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ. ఆయన హీరోగా ధన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హిట్లర్. ఈ సినిమా ప్రమోషన్స్ లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఫ్యాన్ వార్స్ గురించి మాట్లాడారు. సినిమా కలెక్షన్ని ఉద్దేశించి ఫ్యాన్స్ మధ్య తరచూ వివాదం జరుగుతుంది? దానిపై మీ అభిప్రాయం ఏమిటి? అని విలేకరి అడగ్గా.. అలాంటిది ఏమీ లేదని ఆయన బదులిచ్చారు. వసూళ్లను వారు పట్టించుకోరని అన్నారు.
కలెక్షన్స్ ను దృష్టిలో ఉంచుకుని అభిమానులు ఎవరూ బాధపడరు. ఫ్యాన్సు అలాంటివి తెలియదు. డబ్బు ఖర్చు పెట్టి తమకిష్టమైన హీరో సినిమా చూడటం.. ఆ క్షణాలను ఆస్వాదించడం మాత్రమే వారికి తెలుసు. అదీ కాకపోతే.. కొన్ని సందర్భాల్లో ఒక హీరో అభిమాని మరో నటుడిని తిడుతుంటాడు. ఒక సినిమా విడుదలైతే ప్రతి రోజూ ఎన్ని కోట్లు వసూలు చేసిందనే విషయాన్ని వారు పెద్దగా పట్టించుకోరు. చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చినప్పుడు మాత్రమే వారు ఆ విషయం గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే, వారికంటూ ఒక జీవితం ఉంది. దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారు అని విజయ్ ఆంటోనీ తెలిపారు. అనంతరం తన కష్టసుఖాల గురించి మాట్లాడుతూ.. అవన్నీ జీవితంలో భాగమేనని అన్నారు. ప్రతిదానిని ఆస్వాదించాలని తెలిపారు. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా హిట్లర్ సిద్ధమైంది. సెందూర్ ఫిలిమ్ ఇంటర్నేషనల్ నిర్మిస్తోంది. రియా సుమన్ కథానాయికగా కనిపించనున్నారు. చరణ్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మేనన్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తైనప్పటికీ.. టెక్నికల్ వర్క్ వల్ల విడుదల ఆలస్యమైందని దర్శకుడు ధన చెప్పారు. ఇది తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు.