Responsive Header with Date and Time

Category : నేర | Sub Category : జాతీయ Posted on 2024-09-19 17:28:32


షష్టి పూర్తి చేసుకునే వయసులో ఓ ముసలి మన్మథుడు ప్రేమలో పడ్డాడు. ఓ అందాల యువతిని ప్రేమించి, తన ప్రేమ విషయం ఆమెకు తెలియజేశాడు. వారిద్దరూ ఓ పార్కులో కలుసుకోవాలని అనుకున్నారు. కానీ అప్పటి వరకూ ప్రేమ నటించిన యువతి, పార్కుకు తనతోపాటు బాయ్‌ ఫ్రెండ్‌ను కూడా తీసుకొచ్చింది. అతగాడు వీరావేశంలో ముసలి మన్మథుడిని కత్తితో పొడిచాడు. ఈ షాకింగ్‌ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది.బెంగళూరులో 60 ఏళ్ల హితేంద్ర కుమార్‌కు జయనగర్‌లో క్లాత్‌ షాప్‌ ఉంది. ఓ యువతి కొన్ని నెలలుగా అతడి షాప్‌లో పని చేసి మానేసింది. అయితే ఆ యువతిని ప్రేమించిన హితేంద్ర బీటీఎం లేఅవుట్‌లోని కేఈబీ పార్క్‌కు రావాలని యువతికి కబురు పంపాడు. ఆమె అక్కడికి రావడంతో ఇద్దరూ అక్కడ కలుసుకున్నారు. ఈ సందర్భంగా హితేంద్ర తన మనసులోని ప్రేమను ఆమెకు తెలియజేశాడు. సెప్టెంబర్‌ 15న మరోమారు వారిద్దరూ ఆ పార్కుకు వెళ్లారు. రాత్రి 9.30 గంటల సమయంలో ఒక బెంచ్‌పై ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో యువతి స్నేహితుడు సిద్ధు ఆ పార్క్‌కు వచ్చాడు. హితేంద్ర కుమార్‌పై కత్తితో దాడి చేశాడు. కడుపులో ఇతర భాగాలపై కత్తితో అనేక సార్లు పొడిచాడు. దీంతో హితేంద్ర కుప్పకూలిపోయాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించి ఆస్పత్రికి తరలించారు. హితేంద్రకు వైద్యులు సకాలంలో చికిత్స అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

  అతడి ఫిర్యాదుతో యువతి, ఆమె ప్రియుడ్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే క్లాత్‌ షాపులో పని చేసినప్పుడు హితేంద్ర తనను వేధించినట్లు ఆ యువతి ఆరోపించింది. పార్క్‌లో తనకు ప్రపోజ్‌ చేయడం గురించి తన బాయ్‌ ఫ్రెండ్‌కు చెప్పినట్లు తెలిపింది. అంతేకాకుండా గతంలో హితేంద్ర బట్టల దుఖాణంలో ఆ యువతి కొన్ని నెలలు పని చేసి మానేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే హితేంద్ర యువతిని లైంగికంగా వేధించాడా లేక బెదిరించాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి, ఆమె ప్రియుడు కలిసి ఈ నేరానికి ప్లాన్‌ చేసి ఉంటారా అనే కోణంలో కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసును ఛేదించేందుకు హితేంద్ర, ఆ యువతి మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణలను పరిశీలిస్తున్నారు.బట్టల దుకాణంలోని ఉద్యోగుల వాంగ్మూలాలను కూడా నమోదు చేస్తున్నారు. గాయపడిన బాధితుడు కోలుకున్న తర్వాత అతడిని ప్రశ్నించనున్నారు.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
తాజా వార్తలు
Leave a Comment: