Responsive Header with Date and Time

Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2024-09-19 17:27:01


తెలుగు వెబ్ మీడియా న్యూస్: డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్  లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీనిని ఉద్దేశించి తాజాగా నటుడు మంచు మనోజ్ ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. జానీ మాస్టర్.. కెరీర్ పరంగా ఈ స్థాయికి వచ్చేందుకు మీరు ఎంతలా శ్రమించారో అందరికీ తెలుసు. కానీ, ఈరోజు మీ పై ఇలాంటి తీవ్ర ఆరోపణలు రావడం చూస్తుంటే నా హృదయం ముక్కలవుతోంది. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనేది చట్టం నిర్ణయిస్తుంది. ఒక మహిళ తన స్వరాన్ని వినిపించినప్పుడు పారిపోవడం అనేది సమాజానికి, రానున్న తరాలకు ఒక ప్రమాదకరమైన సందేశాన్ని ఇస్తుంది.


ఈ కేసు విషయంలో త్వరితగతిన స్పందించి చర్యలు తీసుకున్న హైదరాబాద్ సిటీ పోలీస్, బెంగళూరు నగర పోలీస్లకు నా అభినందనలు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఇది తెలియజేస్తుంది. జానీ మాస్టర్.. నిజాన్ని ఎదుర్కొండి. మీరు ఏ తప్పూ చేయకపోతే పోరాటం చేయండి. మీరు దోషి అయితే.. దానిని అంగీకరించండి అని హితవు పలికారు. ఇచ్చిన మాట ప్రకారం ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్ని వెంటనే సిద్ధం చేయాలని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ను కోరుతున్నా. దానికంటూ ప్రత్యేకంగా సోషల్ మీడియా ఖాతాలు ఏర్పాటు చేయండి. మన పరిశ్రమలోని మహిళలకు గళంగా నిలవండి. తాము ఒంటరిగా లేమని.. తమ బాధను వింటామనే విషయాన్ని ప్రతి మహిళకు తెలియజేయండి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అండగా నిలబడిన మన పరిశ్రమ పెద్దలు, సహోద్యోగులకు నా మద్దతు తెలియజేస్తున్నా. న్యాయం, గౌరవం అనేది మాటల్లో మాత్రమే కాకుండా చేతల్లోనూ చూపించే విధమైన సమాజాన్ని నిర్మిద్దాం. కుమార్తె, సోదరి, తల్లి.. ఇలా ప్రతి మహిళ కోసం ఈ పోరాటం. వారికి అన్యాయం జరగకుండా చూద్దాం అని మనోజ్ కోరారు.

జానీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన అసిస్టెంట్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2017లో జానీ మాస్టర్ పరిచయమయ్యాడు. 2019లో అతని బృందంలో సహాయ నృత్య దర్శకురాలిగా చేరాను. ముంబయిలో ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం జానీ మాస్టర్ పాటు నేను, మరో ఇద్దరు సహాయకులం వెళ్లాం. అక్కడ హోటల్లో నాపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని, సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పని చేయలేవని బెదిరించాడు. దీన్ని అవకాశంగా తీసుకుని.. హైదరాబాద్ నుంచి ఇతర నగరాలకు సినిమా చిత్రీకరణకు తీసుకెళ్లిన సందర్భాల లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. షూటింగ్ సమయంలోనూ వ్యానిటీ వ్యాన్ లో అసభ్యంగా ప్రవర్తించేవాడు అని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం ఆయన్ని అరెస్ట్ చేశారు. సైబరాబాద్ ఎస్ వోటీ పోలీసు బృందం గోవాలోని లాడ్జిలో అతడిని అదుపులోకి తీసుకుంది.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
తాజా వార్తలు
Leave a Comment: