Category : క్రీడలు | Sub Category : జాతీయ Posted on 2024-09-19 16:49:12
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో టీమిండియా పునరాగమనం చేసింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి రోజు మూడో సెషన్‌లో భారత జట్టు 6 వికెట్లకు 269 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ క్రీజులో ఉన్నారు. వీరిద్దరి మధ్య సెంచరీ భాగస్వామ్యం ఉంది. అశ్విన్, జడేజా ఇద్దరు హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. దీంతో మూడో సెషన్‌లో భారీ స్కోర దిశగా భారత్ ముందుకు సాగుతోంది.
అశ్విన్ తర్వాత జడేజా ఫిఫ్టీ..రవిచంద్రన్ అశ్విన్ తర్వాత రవీంద్ర జడేజా కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వీరిద్దరి మధ్య సెంచరీ భాగస్వామ్యం కూడా ఉంది. 73 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 1 సిక్స్ ఉంది.