Responsive Header with Date and Time

Category : జాతీయ | Sub Category : రాజకీయం Posted on 2024-09-19 15:13:23


నరేంద్ర దామోదరదాస్ మోదీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సామాన్య కార్యకర్త నుంచి ముఖ్యమంత్రిగా.. ప్రధానమంత్రిగా ఎదిగారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా.. మూడు సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వరుసగా మూడో సారి ప్రధానమంత్రిగా ప్రజా సేవలో కొనసాగుతున్నారు.. ఇటు దేశ రాజకీయాలైనా.. అటు ప్రపంచ సమస్యలైనా.. ఆయన స్పందించే విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందిరితో ఆయన మెలిగే విధానం, స్పందించే గుణం.. ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి.. అందుకే.. ఏ దేశాధినేతకు లేనంత క్రేజ్.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మాత్రమే ఉందంటే.. అది మామూలు విషయం కాదు.. ఆయన కఠోర నిర్ణయాలు, స్పష్టమైన విధానాలు, ఆలోచనలు.. భావనలు ఇవన్నీ కూడా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టాయి.. అందుకే.. ఒకప్పుడు.. అమెరికా అధ్యక్షులకు ఎంత క్రేజ్ ఉండేదో.. ఇప్పుడు భారత ప్రధానమంత్రికి అంత గౌరవం లభిస్తుంది.. అందుకే చాలా దేశాలు తమ దేశంలో పర్యాటించాలంటూ భారత్ ను కోరుతుండటం విశేషం.. అది మోదీ నాయకత్వం వల్లనే సాధ్యమైనదంటూ పలువురు రాజకీయ వేత్తలు, విద్యావేత్తలు అభివర్ణిస్తున్నారు. ఆయన స్పందన, విలక్షణ గుణం.. నాయకత్వ పటిమ ఇవన్నీ కూడా భారత్ ను అత్యున్నత స్థానంలో నిలిచేలా చేశాయంటూ అభివర్ణిస్తున్నారు.


చరిత్ర సృష్టించిన జననేత..

నరేంద్ర దామోదరదాస్ మోదీ భారతదేశ 14వ ప్రధానమంత్రి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంతో మే 26న నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత వరుసగా మూడోవసారి ప్రధాని మంత్రిగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జన్మించిన వ్యక్తి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం పార్లమెంటు సభ్యులుగా కొనసాగుతున్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో 1984 తర్వాత తొలిసారిగా లోక్‌సభలో ఒకే రాజకీయ పార్టీకి తొలిసార మెజారిటీ వచ్చింది. ప్రధానమంత్రి కాకముందు, నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా మూడుసార్లు పనిచేశారు. నరేంద్ర మోదీ గుజరాత్‌లోని మెహసానా జిల్లాలోని వాద్‌నగర్‌లో సెప్టెంబర్ 17, 1950లో జన్మించారు. తల్లిదండ్రులు హీరాబాయి, దామోదరదాస్ మోదీ.. నరేంద్ర మోదీ తొలిసారిగా ఎనిమిదేళ్ల వయసులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు పరిచయమైనప్పటికీ, 1970లలో ఆర్‌ఎస్‌ఎస్‌లో పూర్తి స్థాయి కార్యకర్తగా మారారు. 80వ దశకం చివరిలో భారతీయ జనతా పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు.. రాజకీయ ప్రచారమైనా..విపక్షాలపై విమర్శలైనా దటీజ్ మోదీ అనిపించుకోవడమే ఆయన స్టైల్‌ గా మారుతూ వచ్చింది..

ప్రతి ఒక్కరితో కలిసిపోయే తత్వం..

2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ పార్టీ మరోసారి గెలుపొందడంలో నరేంద్ర మోదీ పాత్ర అద్వితీయం. మోదీ తన విధానాలు, దక్షత, దక్షత, సామర్థ్యంతో సంపన్న వర్గాన్ని శాసిస్తే.. ఆయనను ఒక సామాన్యుడిని ప్రధానిగా చూశారు. నేడు, ఒక సాధారణ వ్యక్తి తన సందేశాన్ని, అసాధారణ వ్యక్తిత్వానికి చెందిన నరేంద్ర మోదీకి సులభంగా తెలియజేయడమే కాకుండా, ఆయనను కలవగలుగుతున్నారు. బహుశా అతని జనాదరణ, విజయ రహస్యాలలో ఒకటి.. ఆయన కలుసుకున్న ప్రతి ఒక్కరితోనూ ఆయన కలిసిపోయే గుణం.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ మెప్పించగలిగారు. సీనియర్ నాయకులకు ప్రధాన్యమిస్తూనే.. యువతకు మంచి అవకాశాలు అందిస్తారు.. ప్రోత్సహిస్తారు. అదే.. మోదీకి అభిమానులను రెట్టింపు అయ్యేలా చేసిందంటూ రాజకీయ వేత్తలు అభిప్రాయపడతారు.

ఆదర్శనీయం.. ప్రజల హృదయాలను గెలుచుకున్న నేత..

ప్రధాని మోదీ జీవితం ఎందరికో ఆదర్శనీయం.. ఆయన సిద్ధాంతాలు.. భావజాలం.. నిబద్దత ఇవన్నీ కూడా ఆయన్ను ఉన్నత శిఖరాలకు చేర్చింది.. మోదీ చెప్పే ప్రతీ మాట కూడా ఒక హుందాతనంతోపాటు ఆదర్శంగా నిలుస్తుందనడానికి ఎన్నో ఉదహరణలు ఉన్నాయి.. ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఏ దేశానికి వెళ్లినా సంస్కృతి సంప్రదాయాలను వీడరు.. ఇంకా అక్కడి సమస్యలను అడిగి తెలుసుకుని.. పరిష్కరించేందుకు ముందుంటారు. 125 కోట్ల మంది పౌరుల గొప్ప వారసత్వాన్ని కలిగి ఉన్న భారతదేశంలో.. దుర్భరమైన పరిస్థితితో ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజలు, మార్పు కోసం తహతహలాడుతున్న వారి వ్యక్తిత్వాన్ని మాత్రమే చూస్తున్నారు. సాధారణ రైతుల నుండి పారిశ్రామికవేత్తలు, విద్యార్థుల వరకు లక్షలాది మంది ప్రజలు సైతం ప్రధాని మోదీ వ్యక్తిత్వానికి నాయకత్వానికి ప్రభావితం అయ్యారంటే అతియోశక్తి కాదు.. అవినీతి రహిత, ద్రవ్యోల్బణం రహిత, సమర్థత, బలమైన భారతదేశాన్ని నిర్మించడానికి మోదీ అహర్నిషలు కృషి చేస్తూనే ఉన్నారు. అలా లక్షలాది, కోట్లాదగి ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. వారసత్వం లేదా అదృష్టం ద్వారా అతను పొందిన అధికారం వల్ల కాదు, లెక్కలేనన్ని సంక్షోభాలు, పోరాటాల మధ్య ఎదగడం ద్వారా.. నరేంద్ర మోదీ ఎందరికో ఆదర్శంగా నిలిచారు.

మోదీ జీవితం స్ఫూర్తిదాయకం..

వయస్సు పైబడినా కానీ.. ప్రధాని మోదీ నిత్య విద్యార్థిగా అందరికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు.. చిన్నా పెద్దా, పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరితో కలిసి పోతారు. సరళమైన, సామాన్యమైన, అధ్యాత్మిక జీవనశైలికి అనుకూలంగా ఖరీదైన వస్తువులకు దూరంగా ఉంటారు. అతని వ్యక్తిగత జీవితాన్ని పరిశీలిస్తే.. ఎన్నో విషయాలు మనకు అర్థమవుతాయి.. అతని చుట్టుపక్కల ఉన్న వారిని పిలిచి మరి మాట్లాడుతారు.. చిన్న వ్యక్తులైనా సరే అప్యాయంగా పిలిచి ఆదరిస్తారు. అందుకే.. అతని వ్యక్తిత్వం చాలా మందికి ఆదర్శనీయంగా నిలిచింది.. నిలుస్తోంది.. అణగారిన, నిరుపేద ప్రజల సంక్షేమం కోసం ఆయన హృదయం ఎప్పుడూ తపిస్తూనే ఉంటుంది. నైపుణ్యం కలిగిన పాలకుడిగానే కాదు.. సమర్థవంతమైన వక్త, కవి-రచయిత-ఆలోచనాపరుడిగా పేరు ప్రఖ్యాతలను పొందారు. నరేంద్ర మోదీ జీవితంలోని ముఖ్యమైన మైలురాళ్లు, వ్యక్తిత్వం, దేశభక్తి, కార్యదక్షత, దృక్పథం ఇవన్నీ కూడా ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతున్నాయి.

ఇతరుల పట్ల గౌరవం

ప్రధాని మోదీ.. ఇతరులను గౌరవంతో పలకరిస్తారు.. కోపం, ద్వేషం, అసమానతలు ఇవన్నీ పట్టించుకోకుండా.. ఇతరుల పట్ల ఎల్లప్పుడూ గౌరవంతో ఉంటారు. అందరికీ సముచిత గౌరవం లభించాలన్నదే ప్రధాని మోదీ.. నినాదం.. అందుకే.. ఆయన ఎప్పుడూ కూడా అంత హుందాగా కనిపిస్తారు.. అందరితో మమేకమై.. ముచ్చటిస్తారు.. చిన్నపిల్లలతో ఆప్యాయంగా మాట్లాడుతారు. ఇంకా భావజాలాలు వేరైనా కానీ.. అందరి అభిప్రాయాలను గౌరవిస్తారు. ఇంకా చిన్న చిన్న విషయాలపై.. పలువురు వ్యక్తులతో నేరుగా సంభాషిస్తారు.. వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు.. పార్టీ విషయాల్లోనైనా.. పాలన పరంగా చాలా కఠినంగా కనిపించినప్పటికీ.. ఎదుటి వ్యక్తులకు గౌరవం ఇస్తూ.. చాలా హుందా నడుచుకుంటారు.

ప్రజా జీవితంలో విఐపి సంస్కృతికి వ్యతిరేకం

ప్రధాని మోదీ ప్రజా జీవితంలో అనూహ్య నిర్ణయాలు ఉంటాయి.. ఆయన విఐపి సంస్కృతికి వ్యతిరేకం.. అవసరమైతే.. ఆయన నేరుగా ప్రజలతో మాట్లాడేందుకు ఇష్టపడతారు. ఒక్కోసారి సెక్యూరిటీ పక్కన బెట్టి.. ప్రజల దగ్గరకు వెళతారు.. వారితో ఆప్యాయంగా మాట్లాడుతారు. వారి చెప్పే విషయాలను వింటారు. ఇలా ఆయన ప్రజలకు మరింత చేరువగా ఉంటారు.. ఉదాహరణకు.. ఇటీవల ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ (ICAR) లో జరిగిన ఓ కార్యక్రమంలో.. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వెళ్లారు.. అక్కడ తన గొడుగును తానే పట్టుకుని.. రైతులతో మాట్లాడుతూ కనిపించారు. ప్రధాని మోదీ భద్రతను తిరస్కరించి ప్రజలతో మమేకమైన సందర్భాలు చాలానే ఉన్నాయి.

అందరి నుంచి అభిప్రాయాలు..
నరేంద్ర మోదీ.. ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా.. లేదా తీసుకున్న నిర్ణయాలపై అభిప్రాయాలను తీసుకోవాలన్నా నేరుగా అందరితో సంప్రదిస్తారు. ఉదాహరణకు.. ప్రభుత్వ పథకాలకు సంబంధించి నేరుగా ప్రజలతో మాట్లాడుతారు.. మహిళలతో సంభాషిస్తారు.. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటారు. ఇంకా వ్యవసాయ పథకాలకు సంబంధించి రైతులతో ముఖాముఖి నిర్వహించడం.. అలాగే తాను మాట్లాడిన విషయాలు, ప్రముఖులతో భేటీ.. ఇలా.. ర్యాంక్ హోదా చూడకుండా అందరి నుంచి స్పష్టమైన అభిప్రాయాలను తీసుకుంటారు.. దాని ప్రకారం.. భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయాలు, పథకాల అమలు తదితర అంశాలపై నిర్ణయాలు ఉంటాయని నేతలు పేర్కొంటున్నారు.

దూర దృష్టితో ఆలోచన -నిర్ణయాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలు దూర దృష్టితో ఉంటాయి.. ఉదాహరణకు మోదీ.. అధికారంలోకి రాకముందు జమ్మూకశ్మీర్ 370 యాక్ట్ గురించి వివరించేవారు.. స్వయంప్రతిపత్తి వల్ల ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్పేవారు.. అధికారంలోకి వచ్చిన తర్వాత జమ్మూకశ్మీర్ కు సంబంధించిన 370 యాక్ట్ ను రద్దు చేశారు. ఇంకా నల్లధనం నియంత్రణకు నోట్ల రద్దును చేపట్టారు.. ఇవన్నీ కూడా భారతదేశ ఆర్థిక అభివృద్ధితోపాటు.. భద్రత రక్షణకు నిలయాలుగా నిలిచాయి. అంతేకాకుంగా.. ప్రతి ఒక్క కుటుంబానికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందినప్పుడే.. ఆయా కుటుంబాలకు చేరువవ్వగలం అని తరచూ సందేశమిస్తారు.. ఎందుకంటే.. ఇవి ప్రజలతో నేరుగా సంబంధాలు నెలకొనేలా చేస్తాయి..

స్పష్టంగా ఆలోచించడం..

నలుగురికి నచ్చినది తనకు అసలు నచ్చదంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అందుకే ఇతర నేతలు నడిచిన దారిలో కాకుండా.. తనకంటూ ప్రత్యేక రూట్‌ ఫాలో అవుతారు. ట్రెండ్‌ ఫాలో కాకుండా.. ట్రెండ్‌‌నే సృష్టించే ప్రయత్నం చేస్తారు. అందుకే స్పష్టమైన ఆలోచనలతో.. నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్లుగా చెబుతారు. అందుకే.. ప్రధాని మోదీకి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు. ఆయన ఏదైతే స్పష్టంగా ఆలోచించి చెబుతారో.. అది భవిష్యత్తుకు పునాదులు వేస్తుందంటూ పేర్కొంటారు. ఆయన ప్రారంభించినా పథకాలైనా.. ఎర్రకోట వేదికగా మాట్లాడిన సందర్భాలైనా అదే తెలియజేస్తుందని పేర్కొంటారు.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
తాజా వార్తలు
Leave a Comment: