Responsive Header with Date and Time

Category : క్రీడలు | Sub Category : అంతర్జాతీయ Posted on 2024-09-19 14:38:12


అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత బరువైన క్రికెటర్ ఎవరంటే.? ఠక్కున రకీమ్ కార్న్‌వాల్ అని చెప్పేస్తారు. ఈ భారీకాయుడు ప్రస్తుతం జరుగుతోన్న కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో చెలరేగి మరీ ఆడుతున్నాడు. లీగ్‌లో బార్బడోస్‌ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న రకీమ్‌.. సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పేట్రియాట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. భారీ సిక్సర్లను అలవోకగా కొట్టే రకీమ్.. ఈసారి బంతితో సత్తా చాటాడు. తన టీ20 కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచాడు.సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌పై రకీమ్ కార్న్‌వాల్ రెండు వరుస బంతుల్లో రెండు వికెట్లు తీయడంతో పాటు.. వేసిన ప్రతీ ఓవర్‌లో వికెట్ పడగొట్టాడు. మొత్తంగా 4 ఓవర్లలో 4 ఎకానమీతో 16 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు రకీమ్. టీ20 క్రికెట్‌లో రకీమ్ కార్న్‌వాల్ 5 వికెట్లు పడగొట్టడం ఇదే తొలిసారి. అంతకుముందు టీ20ల్లో అతడి అత్యుత్తమ ప్రదర్శన 10 పరుగులకు 3 వికెట్లు. ఇక సీపీఎల్ 2024లో రకీమ్‌కి ఇది 5వ మ్యాచ్. ఈ 5 వికెట్లతో కలిపి రకీమ్.. సీపీఎల్ కెరీర్‌లో మొత్తంగా 35 వికెట్లు పడగొట్టాడు.

                                   మరోవైపు రకీమ్ కార్న్‌వెల్ దెబ్బకు సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌ జట్టు 20 ఓవర్లు పూర్తిగా ఆడలేకపోయింది. కేవలం 19.1 ఓవర్లలో 110 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత బార్బడోస్ రాయల్స్ 111 పరుగుల లక్ష్యాన్ని ఒక వికెట్ కోల్పోయి.. 52 బంతులు మిగిలి ఉండగానే చేధించింది.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
తాజా వార్తలు
Leave a Comment: