Responsive Header with Date and Time

Category : ఇతర | Sub Category : ఇతర వార్తలు Posted on 2024-09-18 15:32:12


TWM News:-కోవిడ్‌ సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పటికీ జనాల్ని వెంటాడుతున్నాయా..? అప్పట్లో కోవిడ్ బారిన పడిన వారిలో చాలా మందికి గుండెపోటు సర్వ సాధారణమైపోయిందా..? గడిచిన రెండేళ్లు అనేక మంది ఉన్నట్టుండి గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతూ ఉండటంతో ఈ తరహా చర్చలు జరుగుతునే ఉన్నాయి. తాజాగా ఆదివారం హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గణేష్ శోభాయాత్రలో సంతోషంగా డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత ఇంటికెళ్లిన కాసేపటికే గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయారు.

కోవిడ్‌ సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పటికీ జనాల్ని వెంటాడుతున్నాయా..? అప్పట్లో కోవిడ్ బారిన పడిన వారిలో చాలా మందికి గుండెపోటు సర్వ సాధారణమైపోయిందా..? గడిచిన రెండేళ్లు అనేక మంది ఉన్నట్టుండి గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతూ ఉండటంతో ఈ తరహా చర్చలు జరుగుతునే ఉన్నాయి. తాజాగా ఆదివారం హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గణేష్ శోభాయాత్రలో సంతోషంగా డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత ఇంటికెళ్లిన కాసేపటికే గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయారు.

రంగారెడ్డి జిల్లా మణికొండ అల్కాపురికాలనీలో ఈ విషాదం చోటుచేసుకుంది. రాత్రి అల్కాపురి కాలనీ గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న శ్యామ్‌ప్రసాద్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గుండెపోటుతో మృతి చెందారు. అల్కాపురి టౌన్‌షిప్‌ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపం దగ్గర లడ్డూ వేలం పాట కార్యక్రమంలో పాల్గొన్నారు. వేలం పాటలో లడ్డూ కైవసం చేసుకున్న తన స్నేహితుడి ముందు తీన్‌మార్ స్టెప్పులు వేశారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన శ్యామ్‌ ప్రసాద్‌ ఒక్కసారి కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. అంతకుముందు.. ఆయన కూడా లడ్డూ వేలం పాటలో పాల్గొన్నారు. 15 లక్షల వరకు లడ్డూ వేలం‌ పాట పాడారు శ్యామ్‌ప్రసాద్‌. చివరికి స్నేహితుడు అతని కన్నా ఎక్కువ మొత్తానికి పాడి లడ్డూను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత కూడా అందరితో కలిసి సరదగా డాన్సులు చేశారు శ్యామ్. కానీ కాసేపటికి ఇంటికి వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు..

నిజానికి కోవిడ్ తర్వాత వస్తున్న ఈ గుండెపోటు ప్రమాదాలకు కోవిడ్ మాత్రమే కారణం అని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని అధ్యయనాలు మాత్రం కోవిడ్-19 వల్ల శ్వాసకోశ వ్యాధులతోపాటు గుండె పోటు లాంటి ముప్పులు కూడా పెరుగుతాయని చెబుతున్నాయి.

సాధారణంగా ఈ దీర్ఘకాల కోవిడ్ లక్షణాల గురించి చూస్తే.. అంటే కోవిడ్ తగ్గిన తర్వాత కూడా విపరీతమైన అలసట ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఏదైనా పని చేసిన తర్వాత వెంటనే అలసిపోతుంటాం. తరచు జ్ఞాపక శక్తి సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. మెదడు కూడా తీవ్రంగా అలసిపోతుంటుంది. దీన్ని బ్రెయిన్ ఫాగ్ అని కూడా ఉంటారు. ఒక్కోసారి తల తిరగడం వంటి ఇబ్బందులు కూడా కనిపిస్తుంటాయి.

కరోనావైరస్ ఇన్ఫెక్షన్ వల్ల గుండె వ్యాధుల ముప్పు పెరగడం వెనుక రెండు కారణాలు ఉండొచ్చు..

ఒక కొత్త వైరస్‌పై రోగ నిరోధక వ్యవస్థ పోరాటం మొదలుపెట్టినప్పుడు.. ఒక్కోసారి గుండెలోని రక్తనాళాలు కూడా దెబ్బతినే ముప్పు ఉంటుంది. ముఖ్యంగా రక్త నాళాలు కుంచించుకుపోతాయి. ఫలితంగా వాటిలో రక్తం సాఫీగా ప్రసరించేందుకు వీలుపడదు. దీన్నే వ్యాస్కులర్ ఇన్‌ఫ్లమేషన్‌గా పిలుస్తారు. అప్పటికే హృద్రోగాలతో బాధపడేవారికి గుండె సమస్యలు వచ్చే ముప్పు మరింత ఎక్కువవుతుంది.


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
తాజా వార్తలు
Leave a Comment: