Responsive Header with Date and Time

Category : ఇతర | Sub Category : ఇతర వార్తలు Posted on 2024-09-18 15:29:52


TWM News:-సోయాబీన్స్‌.. ఇందులోని పోషకాలు మాంసాహారానికి ప్రత్యామ్నయంగా ఉపయోగపడతాయి. కొంతమంది వీటిని ఇష్టంగా తింటే.. మరికొందరు దీన్ని చూసి పారిపోతారు. కొందరికి సోయాబీన్స్‌ అంటే మహా ఇష్టం. అయితే మరికొందరు వీటిని చైనీస్ వంటకాల మాదిరి వండడానికి ఇష్టపడతారు. మాంసకృత్తులతో నిండిన ఇది అనేక పోషక ప్రయోజనాలను కూడా కలిగి..

సోయాబీన్స్‌.. ఇందులోని పోషకాలు మాంసాహారానికి ప్రత్యామ్నయంగా ఉపయోగపడతాయి. కొంతమంది వీటిని ఇష్టంగా తింటే.. మరికొందరు దీన్ని చూసి పారిపోతారు. కొందరికి సోయాబీన్స్‌ అంటే మహా ఇష్టం. అయితే మరికొందరు వీటిని చైనీస్ వంటకాల మాదిరి వండడానికి ఇష్టపడతారు. మాంసకృత్తులతో నిండిన ఇది అనేక పోషక ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. శాఖాహారమైనా లేదా మాంసాహారమైనా, సోయాబీన్స్‌ కలిపి వంట చేయడం వల్ల ఆహారం రుచి మారడమే కాకుండా ఆరోగ్యానికీ మేలు చేస్తుంది. సోయాబీన్‌లో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ ఇ, ప్రొటీన్, రైబోఫ్లావిన్, కాల్షియం, ఫైబర్, థయామిన్, అమినో యాసిడ్, ఫోలిక్ యాసిడ్ వంటి మొదలైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడం నుండి రక్తపోటును స్థిరంగా ఉంచడం వరకు ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. సోయాబీన్స్‌ తినడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

ఎముకల ఆరోగ్యం

సోయాబీన్స్‌లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాల నిర్మాణాన్ని బలపరుస్తుంది. కాబట్టి ఈ ఆహారం ముఖ్యంగా మహిళలకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే 30 ఏళ్ల తర్వాత మహిళలు ఎముకల క్షీణత వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు సోయాబీన్స్‌ తినడం మంచిది.

రక్తపోటును నియంత్రించడం

రక్తపోటును నియంత్రించడంలో సోయాబీన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సోయాబీన్ పాలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. సోయాబీన్‌లో కొన్ని ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ఒత్తిడి ఎక్కువగా ఉంటే ప్రొటీన్‌ ఫుడ్‌ తినాలని నిపుణులు చెబుతుంటారు. అధిక ప్రోటీన్ ఒత్తిడిని నివారించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి సోయాబీన్స్ తినడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

బరువు తగ్గవచ్చు

సోయాబీన్‌లో అనేక ప్రయోజనకరమైన పదార్థాలు ఉంటాయి. ఇది సులభంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మాంసాహారానికి దూరంగా ఉండే వారు సోయాబీన్స్ ఉపయోగించి కట్లెట్స్, కబాబ్స్ తయారు చేసుకోవచ్చు. బ్రౌన్ రైస్, బిర్యానీ వంటి వంటకాలు సోయాబీన్స్‌తో కూడా తయారు చేసుకోవచ్చు. సోయాబీన్ కండరాల నిర్మాణానికి కూడా సహాయపడుతుంది.


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
తాజా వార్తలు
Leave a Comment: